గత రెండు రోజులుగా వాంఖడే స్టేడియానికి భద్రత ముప్పుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇవన్నీ నిజం కాదని కేవలం వదంతులేనని నగర పోలీస్ కమీషనర్ మంజునాథ్ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న దృష్ట్యా పూర్తి భద్రత కల్పించామని స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా ఈ అసత్య వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రజలెవరూ వాటిని నమ్మొద్దు. అవన్నీ వదంతులే. స్టేడియానికే కాకుండా నగరం మొత్తం పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అమలు చేస్తున్నాం. -మంజునాథ్ సింగే, ముంబయి నగర డీసీపీ
నేడు జరిగే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ముంబయి నాలుగో విజయంపై కన్నేసింది.