వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. ఆఖర్లో వచ్చిన హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 37 పరుగులు చేసి ముంబయిని విజయ తీరాలకు చేర్చాడు.
-
A 16 ball 37* from @hardikpandya7 sees @mipaltan over the line here at Wankhede 🙌🙌 pic.twitter.com/t2OsmcMclq
— IndianPremierLeague (@IPL) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A 16 ball 37* from @hardikpandya7 sees @mipaltan over the line here at Wankhede 🙌🙌 pic.twitter.com/t2OsmcMclq
— IndianPremierLeague (@IPL) April 15, 2019A 16 ball 37* from @hardikpandya7 sees @mipaltan over the line here at Wankhede 🙌🙌 pic.twitter.com/t2OsmcMclq
— IndianPremierLeague (@IPL) April 15, 2019
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు రోహిత్, డికాక్..అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28 రన్స్ చేసిన రోహిత్..మొయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వెంటనే 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్ కూడా వెనుదిరిగాడు.
అనంతరం వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. సూర్యకూమార్ యాదవ్ 29, ఇషాన్ కిషన్ 21, కృనాల్ 11 పరుగులే చేయగలిగారు.
ఆఖర్లో వచ్చాడు..అదరగొట్టాడు
విజయానికి 43 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
బెంగళూరు బౌలర్లలో చాహల్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగులు చేసిన కోహ్లి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్..మొయిన్ అలీతో కలిసి మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ.. మలింగ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. 75 పరుగులు చేసిన డివిలియర్స్ చివరి ఓవర్లో ఔటయ్యాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో పార్థివ్ 28, అక్షదీప్ నాథ్ 2 పరుగులు చేశారు. స్టాయినిస్, నేగి డకౌట్‌గా వెనుదిరిగారు.
-
WATCH: Malinga shows his class with 4/31 👌👌
— IndianPremierLeague (@IPL) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Full video here ▶️https://t.co/62XCEqXETR #MumbaiIndians pic.twitter.com/rx3jlQ9wKB
">WATCH: Malinga shows his class with 4/31 👌👌
— IndianPremierLeague (@IPL) April 15, 2019
Full video here ▶️https://t.co/62XCEqXETR #MumbaiIndians pic.twitter.com/rx3jlQ9wKBWATCH: Malinga shows his class with 4/31 👌👌
— IndianPremierLeague (@IPL) April 15, 2019
Full video here ▶️https://t.co/62XCEqXETR #MumbaiIndians pic.twitter.com/rx3jlQ9wKB
ముంబయి బౌలర్లలో మలింగ 4 వికెట్లు తీశాడు. బెరెండార్ఫ్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.