చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో గెలిచింది ముంబయి ఇండియన్స్. రోహిత్ సేన నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 109 పరుగులకే ఆలౌటైంది సూపర్‌కింగ్స్. మలింగ 4 వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించాడు. ఈ ఐపీఎల్లో చెన్నైను రెండు సార్లు ఓడించింది ముంబయి జట్టే కావడం విశేషం.
-
.@mipaltan do the double over arch rivals CSK to win by 46 runs at Chepauk 🔵#CSKvMI #VIVOIPL pic.twitter.com/aDbm5nlCBp
— IndianPremierLeague (@IPL) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@mipaltan do the double over arch rivals CSK to win by 46 runs at Chepauk 🔵#CSKvMI #VIVOIPL pic.twitter.com/aDbm5nlCBp
— IndianPremierLeague (@IPL) April 26, 2019.@mipaltan do the double over arch rivals CSK to win by 46 runs at Chepauk 🔵#CSKvMI #VIVOIPL pic.twitter.com/aDbm5nlCBp
— IndianPremierLeague (@IPL) April 26, 2019
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయిలో రోహిత్ శర్మ ఆటే హైలేట్. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ నామమాత్రపు స్కోర్లకే వెనుదిరిగినా అతడు మాత్రం 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
మిగతా బ్యాట్స్మెన్లలో డికాక్ 15, లూయిస్ 32, కృనాల్ 1, హార్దిక్ 23, పొలార్డ్ 13 పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. తాహిర్, చాహర్ తలో వికెట్ తీశారు.
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన వాట్సన్ కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఓ ఎండ్‌లో మురళీ విజయ్ నిలదొక్కుకున్నా అతడికి సహకారమందించే వారు కరువయ్యారు.
రైనా 2, రాయుడు 0, జాదవ్ 6, షోరే 5, చాహర్ 0, హర్భజన్ సింగ్ 1 సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాచ్‌ను ఏ దశలోనూ విజయం దిశగా తీసుకెళ్లలేకపోయారు బ్యాట్స్మెన్లు.
అద్భుతంగా బౌలింగ్ చేసిన ముంబయి బౌలర్లు జట్టుకు మరో విజయాన్ని అందించారు. మలింగ 4 వికెట్లు తీశాడు. కృనాల్, బుమ్రా తలో రెండు వికెట్లు... హార్దిక్, అంకుల్ రాయ్ తలో వికెట్ తీశారు.