సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ప్రత్యర్థి కోల్‌కతా జట్టును తక్కువ స్కోరుకే కట్టిడి చేసింది ముంబయి ఇండియన్స్. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులే చేయగలిగింది కోల్‌కతా నైట్‌రైడర్స్. లిన్(41), ఊతప్ప(40) మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The Mumbai Indians restrict #KKR to a total of 133/7. How quickly will the home team achieve this target?#MIvKKR pic.twitter.com/IxLFkPPTUu
">Innings Break!
— IndianPremierLeague (@IPL) May 5, 2019
The Mumbai Indians restrict #KKR to a total of 133/7. How quickly will the home team achieve this target?#MIvKKR pic.twitter.com/IxLFkPPTUuInnings Break!
— IndianPremierLeague (@IPL) May 5, 2019
The Mumbai Indians restrict #KKR to a total of 133/7. How quickly will the home team achieve this target?#MIvKKR pic.twitter.com/IxLFkPPTUu
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది కోల్‌కతా. తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు లిన్- శుభ్‌మన్. అనంతరం స్వల్ప వ్యవధిలోనే లిన్(41), శుభ్‌మన్(9) ఔటయ్యారు.
తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో ఊతప్ప ఒక్కడే చివరి వరకు నిలిచాడు. కానీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 47 బంతులాడి 40 పరుగులు చేసి చివరి ఓవర్లో వెనుదిరిగాడు.
మిగతా వారిలో దినేశ్ కార్తీక్ 3, రింకూ సింగ్ 4 పరుగులు చేయగా రసెల్ డకౌట్ అయ్యాడు.
మ్యాచ్ మొత్తం కట్టుదిట్టంగా బంతులేశారు ముంబయి బౌలర్లు. మలింగ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీశారు.