ETV Bharat / sports

రైడర్స్​తో మ్యాచ్​... ఛాలెంజర్స్​దే బ్యాటింగ్​ - కోల్​కతా నైట్​ రైడర్స్

టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది కోల్​కతా నైట్​ రైడర్స్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో తలపడనుంది రైడర్స్​ జట్టు.

ముందు బ్యాటింగ్ చేయనున్న కోహ్లేసేన..
author img

By

Published : Apr 5, 2019, 7:57 PM IST

ఐపీఎల్​లో నేడు కోల్​కతా నైట్​ రైడర్స్​తో తలపడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. టాస్​ గెలిచిన నైట్​రైడర్స్​ కెప్టెన్​ దినేష్​ కార్తీక్​.. కోహ్లీసేనను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​ని ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది విరాట్​ బృందం. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో సూపర్​ఓవర్​లో ఓడిన కోల్​కతా ఈ మ్యాచ్​లో సత్తా చాటాలని భావిస్తోంది.

  • 4 మ్యాచ్​లాడిన బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​లోనూ గెలవలేదు. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో దాదాపు గెలుపు ఖాయమనుకునే దశలో ఓటమి చవిచూసింది బెంగళూరు. కోహ్లీ, డివిలియర్స్​ నిలకడగా రాణించాల్సి ఉంది. సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్న కోహ్లీసేన ఈ మ్యాచ్​లో పట్టుసాధించాలని భావిస్తోంది.

బెంగళూరు తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. హెట్​మయర్​ స్థానంలో పవన్​ నేగి, ఉమేశ్​ యాదవ్​ స్థానంలో టిమ్ సౌథీని తీసుకుంది.

గత మ్యాచ్​కి దూరమైన కోల్​కతా స్పిన్నర్​ సునీల్ నరైన్ ఈ రోజు అందుబాటులో ఉండనున్నాడు. రసెల్, ఉతప్ప, దినేశ్ కార్తీక్, క్రిస్​ లిన్​లతో కోల్​కతా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించనుంది. ఇక్కడ సగటు స్కోరు 175 నుంచి 180 మధ్య నమోదైంది.

  • జట్లు..

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్ (వికెట్​ కీపర్​), మొయిల్ అలీ, ఏబీ డివిలియర్స్, స్టాయినిస్​, అక్షదీప్ నాథ్, పవన్​ నేగి, నవదీప్ సైనీ, చాహల్, మహ్మద్​ సిరాజ్, టిమ్ సౌథీ.

కోల్​కతా నైట్ రైడర్స్​:

దినేశ్ కార్తిక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రానా, రసెల్, శుభ్​మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్​దీప్​ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యుసన్, ప్రసిద్ధ్​ కృష్ణ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.