కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు. అతడికి 12 లక్షలు ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు లీగ్ అధికారులు.
"ఐపీఎల్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్లో ఓవర్ రేట్‌కు కారణమైంది. అందువల్ల లీగ్ నిబంధనల ప్రకారం సారథికి 12 లక్షల జరిమానా విధించాం."
-లీగ్ ప్రకటన
ఈ మ్యాచ్‌లో కోహ్లీసేనపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ 109కే ఆలౌట్ అయ్యింది. బౌలర్లలో రవి బిష్ణోయ్(3), మురుగన్ అశ్విన్(3) రాణించారు. పంజాబ్ జట్టు విజయంలో సారథి కేఎల్ రాహుల్(132) కీలక పాత్ర పోషించాడు. శతకంతో మెరిసి.. ఇన్నింగ్స్‌ను వన్ మ్యాన్ షోగా నడిపించాడు.
![IPL: Virat Kohli fined for RCB's slow over-rate against Kings XI Punjab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8928494_kxip-vs-rcb.jpg)