చెత్తను రీసైకిల్ చేసి వ్యర్థాలను తగ్గించేందుకు సహాకరించండి... అంటూ ప్రజలకు పిలుపునిస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో వస్తోన్న చెత్తను సేకరించి పునరుత్పాదన చేస్తున్నాయి ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు. వీటికోసం పచ్చ, నీలం రంగుల డబ్బాలను వినియోగిస్తున్నాయి. వీటి గురించి మరింత అవగాహన కల్పిస్తోంది ఆర్సీబీ. క్లీన్‌స్వీప్ హ్యాష్‌టాగ్ పేరిట ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తోంది.
- 2011 నుంచి ప్రారంభం...
ప్రతీ సీజన్లో ఓ మ్యాచులో గ్రీన్ జెర్సీని ఆర్సీబీ జట్టు 2011 నుంచే ధరిస్తూ.. గో గ్రీన్ పేరిట పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. పచ్చదనంతో గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవచ్చని సూచిస్తోంది. దీనిలో భాగంగా మొక్కలు నాటడం సహా ప్రభుత్వ రవాణా ఉపయోగించి ఇంధన వాడకాన్ని తగ్గించాలని ఆర్సీబీ యాజమాన్యం కోరుతోంది.
ప్రతి ఏటా టాస్ వేసే సమయంలో కెప్టెన్ కోహ్లి చిన్న మొక్కను ప్రత్యర్థి జట్టు సారథికి అందిస్తాడు. దీంతో పాటు గ్రీన్ జెర్సీలపై పేర్లు లేకుండా ట్విట్టర్ ఐడీలతో బరిలోకి దిగుతుంది ఆర్సీబీ జట్టు.
-
The two Captains sign the Green jersey, a part of @RCBTweets's #GoGreen initiative to raise awareness on recycling.
— IndianPremierLeague (@IPL) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @RCBTweets team wears green jerseys made of recycled plastic. pic.twitter.com/ikprT6mkgv
">The two Captains sign the Green jersey, a part of @RCBTweets's #GoGreen initiative to raise awareness on recycling.
— IndianPremierLeague (@IPL) April 7, 2019
The @RCBTweets team wears green jerseys made of recycled plastic. pic.twitter.com/ikprT6mkgvThe two Captains sign the Green jersey, a part of @RCBTweets's #GoGreen initiative to raise awareness on recycling.
— IndianPremierLeague (@IPL) April 7, 2019
The @RCBTweets team wears green jerseys made of recycled plastic. pic.twitter.com/ikprT6mkgv
- 2016లో బెంగళూరు ఆటగాళ్లు సైకిళ్ల మీద స్టేడియానికి వచ్చారు. అభిమానులకు సీఎన్జీ రిక్షాలను ఏర్పాటు చేసి 'గో గ్రీన్' కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ.
- 2011లో స్కూలు విద్యార్థులు చెట్లను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించారు.
- 2013లో ఆర్సీబీ జట్టు ప్రపంచంలోనే తొలి కార్బన్ పాజిటివ్ క్రికెట్ టీమ్‌గా ఘనత సాధించింది.
- ఆర్సీబీ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియం... ప్రపంచంలోనే సోలార్‌తో నడుస్తోన్న తొలి క్రికెట్ స్టేడియం.
- స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతిస్తూ ప్రచారాలు నిర్వహిస్తోంది బెంగళూరు జట్టు.