అస్థిరమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది పంజాబ్. ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి ఏడో స్థానంలో ఉంది రాజస్థాన్. ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.
ఇరుజట్లు తలపడిన మొదటి మ్యాచ్‌లోనే మన్కడింగ్ వివాదం చెలరేగింది. రాజస్థాన్ జట్టు ఈ కారణంతోనే ఓటమిపాలైందని.. పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వీరి మధ్య మ్యాచ్ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.
-
"We train with a lot of purpose and we've done very well on this surface". 👌🏼@CoachHesson talks to #SaddaSquad ahead of #KXIPvRR 👇#SaddaPunjab pic.twitter.com/hGrRK1Gwhn
— Kings XI Punjab (@lionsdenkxip) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">"We train with a lot of purpose and we've done very well on this surface". 👌🏼@CoachHesson talks to #SaddaSquad ahead of #KXIPvRR 👇#SaddaPunjab pic.twitter.com/hGrRK1Gwhn
— Kings XI Punjab (@lionsdenkxip) April 15, 2019"We train with a lot of purpose and we've done very well on this surface". 👌🏼@CoachHesson talks to #SaddaSquad ahead of #KXIPvRR 👇#SaddaPunjab pic.twitter.com/hGrRK1Gwhn
— Kings XI Punjab (@lionsdenkxip) April 15, 2019
పంజాబ్ జట్టు బౌలింగ్‌లో స్థిరత్వం కనిపించట్లేదు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడింది. పొలార్డ్ 31 బంతుల్లో 83 పరుగులు చేసి కింగ్స్ ఎలెవన్‌కు విజయాన్ని దూరం చేశాడు.
షమి, ఆండ్రూ టై లతో పాటు ఆల్ రౌండర్ సామ్ కరన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అశ్విన్ తప్ప మిగతావారు రాణించట్లేదు. ఈ మ్యాచ్‌లో సారథికి బౌలర్లు సహకరించాలని జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, మిల్లర్, సామ్ కరన్, మన్దీప్ సింగ్ రాణించాల్సిన అవసరం ఉంది.
-
It's time to guess who this Royal is!
— Rajasthan Royals (@rajasthanroyals) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Hint: He's a new member in the Royal Family! 😉#HallaBol pic.twitter.com/FOCwmrdmGA
">It's time to guess who this Royal is!
— Rajasthan Royals (@rajasthanroyals) April 15, 2019
Hint: He's a new member in the Royal Family! 😉#HallaBol pic.twitter.com/FOCwmrdmGAIt's time to guess who this Royal is!
— Rajasthan Royals (@rajasthanroyals) April 15, 2019
Hint: He's a new member in the Royal Family! 😉#HallaBol pic.twitter.com/FOCwmrdmGA
గత మ్యాచ్‌లో ముంబయిపై విజయంతో రాజస్థాన్ జోరుమీదుంది. బట్లర్ ఫామ్ రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. రహానే, శాంసన్, స్మిత్ కూడా కీలక సమయంలో విలువైన పరుగులు జోడిస్తున్నారు. బౌలర్ల విషయానికొస్తే జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఉనద్కట్, ధవల్ కులకర్ణి, శ్రేయస్ గోపాల్ కూడా రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో గాయంతో దూరమైన స్టోక్స్ ఈ మ్యాచ్‌లో ఆడతాడని జట్టు భావిస్తోంది.
జట్లు (అంచనా)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), సామ్ కరన్, మహమ్మద్ షమి, సర్ఫ్రాజ్ ఖాన్, క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్, అంకిత్ రాజ్‌పుత్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్.
రాజస్థాన్ రాయల్స్:
అజింక్య రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, ధవల్ కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్, రాహుల్ త్రిపాఠి.