రియాన్ పరాగ్... ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో తానెంటో నిరూపించుకున్నాడు. ముంబయి బౌలింగ్‌ను ఎదుర్కొని 29 బంతుల్లో 43 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అర్ధ శతకం చేసుంటే ఐపీఎల్ చరిత్రలో రికార్డు నమోదు చేసేవాడు. కానీ కొద్దిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ధోనీని అభిమానించే ఈ క్రికెటర్.. చెన్నైతో మ్యాచ్‌లోనే అరంగేట్రం చేయడం విశేషం.
ఇప్పుడు రియాన్ పరాగ్ వయసు 17 సంవత్సరాల 160 రోజులు. ఐపీఎల్లో తక్కువ వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఘనత పృథ్వీషా- సంజూ శాంసన్ పేరిట ఉంది. వీరిద్దరూ 18 సంవత్సరాల 169 రోజుల వయసులో ఈ రికార్డు సాధించారు.
ఇది చదవండి: మన్కడింగ్‌కు అశ్విన్ ప్లాన్... ధావన్ డ్యాన్స్