ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్‌లో చోటు కోసం పట్టుదలగా ఉంది కోల్‌కతా నైట్ రైడర్స్. 16 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్న ముంబయి టాప్-2లో చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండింటి మధ్య వాంఖడే వేదికగా నేడు రసవత్తర పోరు జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
-
Getting all plans in place for our last league game of @IPL 2019 💯#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvKKR @ImRo45 @MahelaJay pic.twitter.com/ksB1bV2vdO
— Mumbai Indians (@mipaltan) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Getting all plans in place for our last league game of @IPL 2019 💯#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvKKR @ImRo45 @MahelaJay pic.twitter.com/ksB1bV2vdO
— Mumbai Indians (@mipaltan) May 4, 2019Getting all plans in place for our last league game of @IPL 2019 💯#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvKKR @ImRo45 @MahelaJay pic.twitter.com/ksB1bV2vdO
— Mumbai Indians (@mipaltan) May 4, 2019
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్ నిలకడగా ఆడుతూ జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆకట్టుకోవాల్సి ఉంది. వాంఖడేలో ఆడిన అనుభవం కార్తీక్‌కు ఉంది. అక్కడ సత్తా చాటాలని కోల్‌కతా అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సీజన్లో ఎక్కువగా రసెల్‌పైనే ఆధారపడిన కోల్‌కతా సమష్టిగా రాణించాల్సి ఉంది. బౌలింగ్ విభాగం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. స్లో బౌలర్లకు వాంఖడే అనుకూలించే అవకాశముంది.
గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూపర్ ఓవర్లో గెలిచిన ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ పక్కా చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి టాప్-2లోకి వెళ్లాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ రన్‌రేట్‌తో గెలిస్తే ముంబయి అగ్రస్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉంది.
-
📹 | "Striking well in the nets gives you a lot of confidence before the game. That's why the boys came out and gave an extra effort." - Evin Lewis#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvKKR pic.twitter.com/GMZFrq7SpZ
— Mumbai Indians (@mipaltan) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">📹 | "Striking well in the nets gives you a lot of confidence before the game. That's why the boys came out and gave an extra effort." - Evin Lewis#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvKKR pic.twitter.com/GMZFrq7SpZ
— Mumbai Indians (@mipaltan) May 4, 2019📹 | "Striking well in the nets gives you a lot of confidence before the game. That's why the boys came out and gave an extra effort." - Evin Lewis#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvKKR pic.twitter.com/GMZFrq7SpZ
— Mumbai Indians (@mipaltan) May 4, 2019
హార్దిక్ పాండ్య(380), డికాక్(462) ఈ సీజన్లో చక్కటి ప్రదర్శనతో చేశారు. చాలా మ్యాచ్‌ల్లో ముంబయిని ఓటమి నుంచి గట్టెక్కించారు. రోహిత్ శర్మ(331), సూర్యకుమార్ యాదవ్(292) నిలకడగా ఆడుతున్నారు. ఇంతకుముందులా పొలార్డ్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 240 పరుగుల చేసిన కీరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.
బౌలింగ్ విభాగంలో బుమ్రా, మలింగ, రాహుల్ చాహర్‌లు నిలకడగా రాణిస్తున్నారు ముంబయి సీమర్లు. ముంబయి తురుపుముక్క బుమ్రా సూపర్ ఓవర్లో సన్‌రైజర్స్‌ను 8 పరుగులకే కట్టడి చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్..
దినేశ్ కార్తీక్(కెప్టెన్, కీపర్), శుభ్‌మన్ గిల్, క్రిస్‌లిన్, రసెల్, సునీల్ నరైన్, ఊతప్ప, నితీశ్ రానా, రింకూ సింగ్, పియూష్ చావ్లా, సందీప్ వారియర్, హ్యారీ గుర్నే.
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ (సారథి), లసిత్ మలింగ, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, ఎవిన్ లూయిస్, బరీందర్ సరన్, బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్