రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్ మోరిస్ స్థానంలో సందీప్‌ను ఆడించనుంది దిల్లీ జట్టు. మరోవైపు మొయిన్ అలీ స్థానంలో క్లాసన్‌కు అవకాశమిచ్చింది బెంగళూరు.
-
.@DelhiCapitals Skipper Shreyas Iyer wins the toss and elects to bat first against @RCBTweets #DCvRCB pic.twitter.com/28KJQ3DNI9
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@DelhiCapitals Skipper Shreyas Iyer wins the toss and elects to bat first against @RCBTweets #DCvRCB pic.twitter.com/28KJQ3DNI9
— IndianPremierLeague (@IPL) April 28, 2019.@DelhiCapitals Skipper Shreyas Iyer wins the toss and elects to bat first against @RCBTweets #DCvRCB pic.twitter.com/28KJQ3DNI9
— IndianPremierLeague (@IPL) April 28, 2019
పిచ్ పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. ముందు బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుంది. ఈ రోజు జట్టులో మూడు మార్పులు చేసింది బెంగళూరు. టిమ్ సౌథి స్థానంలో శివమ్ దుబే ఆడనున్నాడు. అక్షదీప్ స్థానంలో గుర్కిరత్కు అవకాశమిచ్చింది.
దిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సులభంగా ప్లే ఆఫ్‌కు చేరుతుంది క్యాపిటల్స్. ఇప్పటికే ఆడిన 11 మ్యాచుల్లో ఏడు గెలిచి జోరుమీదుంది క్యాపిటల్స్. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది బెంగళూరు. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిందే.
జట్లు
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, డివిలియర్స్, శివమ్ దుబే, ఉమేష్ యాదవ్, క్లాసన్, చాహల్, గుర్కీరత్ సింగ్, స్టాయినిస్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్
దిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, కొలిన్ ఇన్గ్రమ్, సందీప్, అక్షర్ పటేల్, రబాడ, రిషభ్ పంత్, పృథ్వీ షా, రూథర్ ఫర్డ్