దిల్లీ వేదికగా అతిథ్య జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 185 పరుగుల స్కోరు చేసింది. కరీబియన్ వీరుడు రసెల్... మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచిన దిల్లీ... కోల్‌కతాకు బ్యాటింగ్ అప్పగించింది. నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్‌లో ఆండ్రీ రసెల్, కెప్టెన్ కార్తీక్ మినహా అందరూ విఫలమయ్యారు. ఓపెనర్లుగా వచ్చిన నిఖిల్ 7, లిన్ 20 పరుగులే చేశారు.
మరోసారి మెరిసిన రసెల్..
మరోసారి కోల్‌కతా జట్టుకు అండగా నిలబడ్డాడు రసెల్. కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించాడీ కరీబియన్ క్రికెటర్. 52 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
మరోవైపు కెప్టెన్ దినేశ్ కార్తీక్ నెమ్మదిగా ఆడినా.. 50 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్న నితీశ్ రానా ఈ మ్యాచ్‌లో ఒక పరుగే చేసి పెవిలియన్ బాట పట్టాడు.
దిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. రబాడా, సందీప్, మోరిస్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు.