ఈ ఏడాది ఐపీఎల్లోఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోష్ మీదున్న జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్.తొలి మ్యాచ్‌లో ముంబయిపై గెలిచి ఉత్కంఠ భరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో చెన్నైపై పరాజయం చెందిన జట్టు దిల్లీ క్యాపిటల్స్. ఈ రెండింటి మధ్య దిల్లీ ఫిరోజ్ షా కోట్ల వేదికగానేడుమ్యాచ్ జరగనుంది.
దిల్లీ పిచ్ స్పిన్‌కి అనుకూలించే అవకాశముంది. సొంతగడ్డపై ఆడడందిల్లీ క్యాపిటల్స్‌కు కలిసొచ్చే అంశం. కోల్‌కతా జట్టులోస్పిన్ త్రయం(నరైన్, కుల్దీప్, పియూష్) బంతిని తిప్పేందుకు సిద్ధంగా ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్
గత మ్యాచ్‌ల్లో సత్తా చాటిన నితీశ్ రానా, ఆండ్రీ రసెల్, రాబిన్ ఉతప్ప, శుభమన్ గిల్... మరోసారి కీలకం కానున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణిస్తున్నారు రసెల్, నరైన్. సమష్టిగా రాణిస్తున్న రైడర్స్ జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. క్యాపిటల్స్‌పై గెలిచి దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
దిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, రిషభ్‌పంత్ గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నారు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 78 పరుగులతో విశ్వరూపం చూపించాడు పంత్. మరోసారి ఇలాంటి ఇన్నింగ్స్‌ని కోరుకుంటున్నారు దిల్లీ అభిమానులు. బౌలింగ్‌లో రబాడా దిల్లీ జట్టుకున్న అస్త్రం. పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు తీయగల సమర్థుడీదక్షిణాఫ్రికా పేసర్. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలు కీలకం కానున్నారు. గత మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే అవుటైన పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ అందుకోవాల్సి ఉంది.
కోల్‌కతా తరఫున గత రెండు మ్యాచ్‌ల్లో విజృభించిన రసెల్‌పైనే అందరిపైనే దృష్టి ఉంది.ఓటమి వరకు వెళ్లిన జట్టుకు విజయం తెచ్చిపెట్టిన రసెల్ కోసం తగిన వ్యూహాలను రూపొందిస్తోంది క్యాపిటల్స్.
జట్ల అంచనా:
కోల్‌కతా నైట్ రైడర్స్:
దినేశ్ కార్తీక్(కెప్టెన్, కీపర్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రానా, ఆండ్రీ రసెల్, శుభ్‌మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ
దిల్లీ క్యాపిటల్స్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్(కీపర్), ఇన్‌గ్రామ్, కీమో పాల్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాతియా, మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ