ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరిపోయాయి. మరో స్థానం కోసం రాజస్థాన్, హైదరాబాద్, కోల్‌కతా, పంజాబ్ పోటీపడుతున్నాయి. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నేడు దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. దిల్లీ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ జరుగనుంది.
దిల్లీ ప్రధాన పేసర్ రబాడ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదీ దక్షిణాఫ్రికా పేసర్. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన దిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకోవడంపై కన్నేసింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు విజయోత్సాహంతో వెళ్లాలని భావిస్తోంది దిల్లీ. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిన శ్రేయస్ సేనకు ఈ విజయం భరోసా కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
-
The hustle for our final league game of the season is underway 💪🏻#DCvRR #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/1Gg3ywgNih
— Delhi Capitals (@DelhiCapitals) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The hustle for our final league game of the season is underway 💪🏻#DCvRR #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/1Gg3ywgNih
— Delhi Capitals (@DelhiCapitals) May 3, 2019The hustle for our final league game of the season is underway 💪🏻#DCvRR #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/1Gg3ywgNih
— Delhi Capitals (@DelhiCapitals) May 3, 2019
రబాడ గైర్జాజరైనప్పటికీ క్రిస్ మోరిస్, బౌల్ట్, రూథర్‌ఫోర్డ్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలతో బౌలింగ్ విభాగం బలంగానే కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్ తిరిగి రాణించాలని జట్టు భావిస్తోంది. చెన్నైపై శ్రేయస్ 44 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు.
ఆడిన 13 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఉంది రాజస్థాన్ రాయల్స్. సాంకేతికంగా చూస్తే ఈ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మిగిలిన జట్ల ఓటములపై ఆధారపడి టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఉంది.
-
Gotta keep track of all the efforts our boys are putting in! 🔥
— Rajasthan Royals (@rajasthanroyals) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
And, the new @FitbitIN does exactly that! 😎🙌🏾 #HallaBol pic.twitter.com/EbYU044uUE
">Gotta keep track of all the efforts our boys are putting in! 🔥
— Rajasthan Royals (@rajasthanroyals) May 3, 2019
And, the new @FitbitIN does exactly that! 😎🙌🏾 #HallaBol pic.twitter.com/EbYU044uUEGotta keep track of all the efforts our boys are putting in! 🔥
— Rajasthan Royals (@rajasthanroyals) May 3, 2019
And, the new @FitbitIN does exactly that! 😎🙌🏾 #HallaBol pic.twitter.com/EbYU044uUE
ప్రపంచకప్ దృష్ట్యా స్వదేశానికి పయనమైన స్టీవ్ స్మిత్ స్థానంలో రహానే తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. స్మిత్, బట్లర్, బెన్‌స్టోక్స్ జట్టుకు దూరమవగా.. బ్యాటింగ్‌లో రహానే, సంజు శాంసన్, లివింగ్‌స్టోన్‌లపై ఎక్కువ భారం పడనుంది. బౌలింగ్‌లో శ్రేయస్ గోపాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి సత్తాచాటాడు. వరుణ్ అరోన్, రియాన్ పరాగ్, ఉనద్కట్, ఒషానే థామస్‌లు రాణించాల్సిన అవసరం ఉంది.
జట్లు (అంచనా)
రాజస్థాన్ రాయల్స్
రహానే (సారథి), స్టువర్ట్ బిన్నీ, వరుణ్ అరోన్, జయదేవ్ ఉనద్కట్, సంజు శాంసన్, శ్రేయస్ గోపాల్, లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రోర్, ఒషానే థామస్, రియాన్ పరాగ్, టర్నర్
దిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్ (సారథి), శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, కొలిన్ ఇన్‌గ్రామ్, బౌల్డ్, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, జగదీశ సుచిత్, రిషభ్ పంత్, పృథ్వీషా, రూథర్‌ఫోర్డ్