దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. కోల్‌కతా వేదికగగా జరుగుతున్న మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(65, 39 బంతుల్లో) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మరోసారి చివర్లో రసెల్ (45) విజృంభించాడు. దిల్లీ బౌలర్లలో రబాడా, మోరిస్, కీమో పాల్.. తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు... ఖాతా తెరవకుండానే జోయ్ (0) వికెట్ కోల్పోయింది. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో జోయ్ ఎదుర్కున్న తొలి బంతికే ఔటయ్యాడు. అనంతరం శుభ్‌మన్ గిల్- ఊతప్ప మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. 9వ ఓవర్లో రబాడా బౌలింగ్‌లో ఊతప్ప (28) వెనుదిరిగాడు. కొద్దిసేపటికే నితీశ్ రానా (11), దినేశ్ కార్తీక్ (2) కూడా పెవిలియన్ చేరారు. చివర్లో రసెల్ మళ్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A quick fire 45 from @Russell12A and a well compiled 65 from @RealShubmanGill help @KKRiders post a total of 178/7 on board https://t.co/ShBwry6ksx #KKRvDC pic.twitter.com/aRAidUbAmh
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 12, 2019
A quick fire 45 from @Russell12A and a well compiled 65 from @RealShubmanGill help @KKRiders post a total of 178/7 on board https://t.co/ShBwry6ksx #KKRvDC pic.twitter.com/aRAidUbAmhInnings Break!
— IndianPremierLeague (@IPL) April 12, 2019
A quick fire 45 from @Russell12A and a well compiled 65 from @RealShubmanGill help @KKRiders post a total of 178/7 on board https://t.co/ShBwry6ksx #KKRvDC pic.twitter.com/aRAidUbAmh
ముందు గిల్...తర్వాత రసెల్
జోయ్ వికెట్ కోల్పోయినప్పటికీ శుభ్‌మన్ గిల్ మొదటి నుంచి ధాటిగా ఆడాడు. 35 బంతుల్లోనే ఐపీఎల్లో తన రెండో అర్ధశతకాన్ని నమోదుచేశాడు. 7 ఫోర్లు, 2సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం పాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత రసెల్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.
19వ ఓవర్లో ప్రమాదకరంగా మారుతున్న రసెల్‌ని క్రిస్ మోరిస్ పెవిలియన్ చేర్చాడు. రసెల్ ఔటైన తర్వాత కోల్‌కతా స్కోరు వేగం మందగించింది.