నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) అనేది సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఫీల్డ్‌లో ఉన్న ఇద్దరు అంపైర్లు ఏదైనా సందర్భంలో నిర్ణయాన్ని తీసుకోలేనపుడు థర్డ్ అంపైర్ సహాయాన్ని కోరతారు. ఈ మూడో అంపైర్ సాంకేతికత సాయంతో కచ్చితమైన నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఒక్కోసారి ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని డీఆర్ఎస్ ద్వారా ఛాలెంజ్ చేయొచ్చు.
-
The DRS timer race ft Dhoni, Rohit https://t.co/3KJK906K3J via @ipl
— Ajay Raj (@iamAjayraj9) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The DRS timer race ft Dhoni, Rohit https://t.co/3KJK906K3J via @ipl
— Ajay Raj (@iamAjayraj9) April 14, 2019The DRS timer race ft Dhoni, Rohit https://t.co/3KJK906K3J via @ipl
— Ajay Raj (@iamAjayraj9) April 14, 2019
- అంపైర్ రివ్యూ...
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో సాంకేతికత సాయంతో రనౌట్లు, ఎల్బీడబ్ల్యూ, క్యాచ్‌లు, స్టంపౌట్లు, బౌండరీల వద్ద ఫీల్డింగ్‌ను చెక్ చేసేందుకు అంపైర్ రివ్యూ వాడతారు. ఇందుకు ప్రత్యేక కాల పరిమితి లేదు. అంపైర్లు థర్డ్ అంపైర్‌కు వీడియో సంజ్ఞ రూపంలో నివేదిస్తారు.
- ఆటగాళ్ల రివ్యూ...
బ్యాట్స్‌మన్ లేదా ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ ఏదైనా నిర్ణయంపై ఈ రివ్యూ తీసుకోవచ్చు. ఎల్బీడబ్ల్యూ, ఎడ్జ్ క్యాచ్‌ల విషయంలో మూడో అంపైర్ నిర్ణయాన్ని కోరతారు. టీ ఆకారపు సంకేతం ద్వారా 15 సెకన్ల లోపు రివ్యూ అడుగుతారు. మూడో అంపైర్ ఈ నిర్ణయాల కోసం ప్రత్యేకమైన సాంకేతికత వాడతారు.
- స్లో మోషన్ రీప్లే: మూడో అంపైర్ స్లో మోషన్లో అన్ని కోణాల్లో బంతి రాక, బ్యాట్స్‌మన్ ఆడిన విధానాన్ని పరిశీలిస్తారు. బ్యాటుకు బంతి తగిలిందా లేదా అన్న సందిగ్ధ సమయంలో దీన్ని వాడతారు. ముఖ్యంగా బౌలర్లు నోబాల్ వేశారా లేదా లైన్ తొక్కాడా లేదా అనేది చూస్తారు.
- ఇన్ఫ్రా రెడ్ కెమెరాలు: ఇన్ఫ్రా రెడ్ కెమెరాలతో ప్రత్యేకంగా ఇమేజ్ను పరిశీలిస్తారు. బ్యాటుకు బంతి తగిలిందా లేదా అన్నది బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తుంది.
- ఎడ్జ్ డిటెక్షన్: ప్రత్యేకంగా వికెట్ల వద్ద అమర్చిన మైక్రో ఫోన్ల ద్వారా బ్యాటుకు బంతి తగిలిన సౌండును పరిశీలిస్తారు. వేవ్ రూపంలో మనకు ఇది కనిపిస్తుంది.
- బాల్ ట్రాకింగ్: ఇది ఎల్బీడబ్ల్యూను నిర్దరించేందుకు ఉపయోగిస్తారు. స్టేడియం చుట్టూ వివిధ చోట్ల అమర్చిన కెమెరాలతో చూస్తారు. దీని ద్వారానే బంతి వికెట్లను తాకుతుందా లేదా అన్నది కచ్చితంగా తెలుస్తుంది. బంతి పడి ఎలా వెళ్తుంది.? వికెట్లకు తగులుతుందా లేదా అనేది పరిశీలిస్తారు. బంతి వెళ్తోన్న విధానం ఆధారంగా ఇది చూస్తారు. ఇన్లైన్, ఔట్ లైన్, వికెట్ హిట్టింగ్ చూస్తారు.
ఎల్బీడబ్ల్యూ రివ్యూ...
క్రికెట్లో ఎక్కువగా ఉపయోగించే రివ్యూ ఇది. ఫీల్డ్ అంపైర్ సెకన్లలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అంపైర్ నిర్ణయంపై ఆటగాళ్లు మళ్లీ సమీక్ష కోరితే పై సాంకేతికత సాయంతో చెక్ చేస్తారు.
- ఒక జట్టు ఎన్ని సరైన రివ్యూలైనా కోరవచ్చు. రివ్యూ తప్పు అయితే మాత్రం చాన్సులు తగ్గిపోతాయి. టెస్టుల్లో 80 ఓవర్ల తరవాత రివ్యూ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రెండు రివ్యూలు తీసుకునే అవకాశముంది. వన్డేల్లో ఇరు జట్లకు ఒక్కో రివ్యూ ఇస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">