హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. 163 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన దిల్లీ జట్టులో పృథ్వీ షా(56), రిషభ్ పంత్(49) అదరగొట్టారు. విశాఖ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఆరంభంలో దిల్లీ జట్టు ఓపెనర్ పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. చివర్లో పంత్ పరాక్రమం చూపాడు. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్, రషీద్ ఖాన్, భువి చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రిషభ్ పంత్‌కు దక్కింది.
ఈ ఓటమితో సన్‌రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నెల 10న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ.. హైదరాబాద్‌ను 162 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా- ధావన్ 66 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం శిఖర్ ఔటైనా పృథ్వీషా అర్ధశతకంతో రాణించాడు.
-
Keemo Paul ends the tension!@DelhiCapitals win the #Eliminator by 2 wickets and move on to Qualifier 2 🔵#DCvSRH pic.twitter.com/WzpjUeg5pC
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Keemo Paul ends the tension!@DelhiCapitals win the #Eliminator by 2 wickets and move on to Qualifier 2 🔵#DCvSRH pic.twitter.com/WzpjUeg5pC
— IndianPremierLeague (@IPL) May 8, 2019Keemo Paul ends the tension!@DelhiCapitals win the #Eliminator by 2 wickets and move on to Qualifier 2 🔵#DCvSRH pic.twitter.com/WzpjUeg5pC
— IndianPremierLeague (@IPL) May 8, 2019
పృథ్వీ, పంత్‌ల పరాక్రమం..
ఓపెనర్ పృథ్వీ షా 38 బంతుల్లో 56 పరుగులు చేసి దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ కెరీర్లో మూడో అర్ధశతకాన్ని నమోదు చేసిన పృథ్వీ షా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రిషభ్ పంత్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 21 బంతుల్లోనే 49 పరుగులు చేసి దిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు.
మలుపు తిప్పిన ఆ ఒక్క ఓవర్..
మూడు ఓవర్లలో 34 పరుగుల చేయాల్సిన తరుణంలో బసిల్ థంపీ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌ను మలులు తిప్పింది. రిషభ్ పంత్ 4, 6 , 4 , 6 కొట్టి ఈ ఓవర్లో 22 పరుగులు సాధించాడు. 19 ఓవర్లో పంత్ ఔటైనా మ్యాచ్ విజయం అప్పటికే చేరువైంది.
చివరి ఓవర్లో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆఖరి ఓవర్‌కు 5 పరుగులు అవసరమవగా తొలి మూడు బంతులకు మూడు పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి అమిత్ మిశ్రా సింగిల్ తీయడానికి ప్రయత్నించగా.. ఖలీల్ అహ్మద్ ఆ బంతిని నాన్‌స్ట్రయిక్ ఎండ్ వైపు విసిరాడు. కానీ మధ్యలో మిశ్రా అడ్డు వచ్చాడు. దీనిపై సన్‌రైజర్స్ అంపైర్‌కు అప్పీల్ చేయగా.. రిప్లేలో ఉద్దేశపూర్వకంగా మిశ్రా వికెట్లకు అడ్డం వచ్చినట్టు తేలింది. థర్డ్ అంపైర్ మిశ్రాను రనౌట్‌గా ప్రకటించాడు. రెండు బంతులకు 2 పరుగులు అవసరమవగా తర్వాతి బంతిని కీమో పాల్ ఫోర్‌గా మలిచి దిల్లీని గెలిపించాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టులో గప్తిల్(36), విజయ్ శంకర్(25) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దిల్లీ బౌలర్లలో కీమో పాల్ మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బౌల్ట్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడటం సన్‌రైజర్స్‌కు ఇది మూడోసారి. ఇంతకు ముందు 2013, 2017లో రాజస్థాన్, కోల్‌కతాలపై ఓడిపోయింది.