ETV Bharat / offbeat

చలికాలంలో "మునగ సూప్​"తో జలుబు, దగ్గు తగ్గుతాయట!- ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి! - MORINGA SOUP RECIPE

-శీతాకాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న జలుబు, దగ్గు -రోజూ ఈ మునగ సూప్​ తాగితే మేలంటున్న నిపుణులు

How to Make Moringa Soup Recipe
How to Make Moringa Soup Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 12:22 PM IST

How to Make Moringa Soup Recipe: చలికాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. దీంతో చాలా మంది జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి సీజనల్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు ఒంటికి వెచ్చదనాన్ని అందించే సూపులు తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే, క్యారెట్​, బీట్​రూట్​, టమాటాలతో సూపులు చేయడం ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా మునగ సూప్‌ ట్రై చేయండి.

మునగ అన్నికాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే కూరగాయల్లో ఒకటి. దీని కాయలే కాదు.. ఆకులూ, పువ్వుల్లోనూ పోషకాలెన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో తరచూ మునగ సూప్​ తాగడం వల్ల జలుబు, దగ్గుతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని అంటున్నారు. అలాగే చలి నుంచి కూడా రక్షణ పొందవచ్చంటున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్​ హెల్దీ మునగ సూప్​ ఎలా చేయాలి ? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మునక్కాడ ముక్కలు-కప్పు
  • మునగ పువ్వులు -పావుకప్పు
  • ఉల్లిపాయ-1
  • చెంచా వెన్న
  • చిన్న అల్లం ముక్క
  • జీలకర్ర- అర టీస్పూన్​
  • ఉప్పు -రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా మునక్కాయల్ని ముక్కల్లా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక పాత్ర పెట్టండి. ఇందులో వెన్న వేసి కరిగించండి. ఆపై మునక్కాడ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్క, శుభ్రంగా కడిగిన మునగ పువ్వులు వేసి రెండు నిమిషాలు వేపండి.
  • ఇప్పుడు పాత్రలో సగానికిపైగా వాటర్​ పోసి బాగా మరగనివ్వాలి. సూప్​ సగమయ్యాక ఓ పాత్రలోకి వడకట్టుకోవాలి.
  • దీనిని సర్వ్​ చేసుకునే ముందు పైన కాస్త కొత్తిమీర తరుగు, ఉప్పు, పెప్పర్‌ చల్లుకుని వేడివేడిగా తాగితే సరి. అలాగే ఈ సూప్​లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకున్నా రుచి ఎంతో బాగుంటుంది.

మునగ సూపుతో ప్రయోజనాలు :

  • మునక్కాడలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తరచూ తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండా ఈ సూప్‌ తోడ్పడుతుంది.
  • సాధారణంగా చలికాలంలో జీర్ణప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. ఈ ఇబ్బంది ఎక్కువగా ఉన్నవారు డైలీ మార్నింగ్​ కప్పు మునగ సూప్‌ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
  • అలాగే ఇందులోని ఫైబర్‌ ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇంకా మలబద్ధకం సమస్యని నివారిస్తుంది.
  • మునగలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా మారుస్తాయి.
  • అలాగే మునగలోని పొటాషియం నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటు అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
  • ఈ సూప్‌తో పోషకలేమిని అధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

మీకు సూప్స్​​ అంటే ఇష్టమా ? - ఓసారి "చికెన్ షోర్బా" ట్రై చేయండి - టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది!!

"బీరకాయ సూప్​"తో బరువు, షుగర్​ తగ్గుతాయట! - ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.