కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. రైనా.. ఈ సీజన్లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. చివరి వరకు నిలిచి 58 పరుగులు సాధించాడు.
-
Another win under the belt for the @ChennaiIPL. Raina and Jadeja see them over the line as the visitors win by 5 wickets 👏👏 pic.twitter.com/QOMt5nVHr4
— IndianPremierLeague (@IPL) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another win under the belt for the @ChennaiIPL. Raina and Jadeja see them over the line as the visitors win by 5 wickets 👏👏 pic.twitter.com/QOMt5nVHr4
— IndianPremierLeague (@IPL) April 14, 2019Another win under the belt for the @ChennaiIPL. Raina and Jadeja see them over the line as the visitors win by 5 wickets 👏👏 pic.twitter.com/QOMt5nVHr4
— IndianPremierLeague (@IPL) April 14, 2019
రైనా నిలిచాడు.. మ్యాచ్ గెలిపించాడు
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు మంచి ఆరంభమే లభించింది. డుప్లెసిస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్ వాట్సన్ 6 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. వన్‌డౌన్‌లో దిగిన రైనా స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 24 రన్స్ చేసిన డుప్లెసిస్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
-
Oh what a win for the @ChennaiIPL 🙌🙌#KKRvCSK pic.twitter.com/Vpi45RAEHo
— IndianPremierLeague (@IPL) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Oh what a win for the @ChennaiIPL 🙌🙌#KKRvCSK pic.twitter.com/Vpi45RAEHo
— IndianPremierLeague (@IPL) April 14, 2019Oh what a win for the @ChennaiIPL 🙌🙌#KKRvCSK pic.twitter.com/Vpi45RAEHo
— IndianPremierLeague (@IPL) April 14, 2019
చివరి వరకు నిలిచిన రైనా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో 36వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో రాయుడు 5, జాదవ్ 20, ధోని 16, జడేజా 31 పరుగులు చేశారు.
కోల్‌కతా బౌలర్లలో నరైన్, చావ్లా తలో రెండు వికెట్లు తీశారు. హ్యారీ గుర్నే ఒక వికెట్ సాధించాడు.
లిన్ ఒక్కడే..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్ లిన్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. సహచర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లేకున్నా 82 పరుగులు చేసి జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
మిగతా వారిలో నరైన్ 2, నితీశ్ రానా 21, దినేశ్ కార్తీక్ 18, రసెల్ 10, శుభ్‌మన్ గిల్ 15, చావ్లా 4 పరుగులు చేశారు. ఊతప్ప, కుల్దీప్ డకౌట్ అయ్యారు.
తాహిర్ తడాఖా
చెన్నై బౌలర్లలో తాహిర్.. 27 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రసెల్, లిన్, నితీశ్ రానా, ఊతప్ప ఇతని బౌలింగ్‌లోనే ఔటయ్యారు. శార్దుల్ ఠాకుర్ 2 వికెట్లు, శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.