చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన గౌరవప్రదమైన స్కోరు చేసింది. పొలార్డ్(41), డికాక్(29) మినహా మిగతా వారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. తాహిర్, శార్దుల్ ఠాకుర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @ChennaiIPL restrict #MumbaiIndians to a total of 149/8 in Finals of the #VIVOIPL.
Will #CSK chase this down? pic.twitter.com/kVTcVqDnAq
">Innings Break!
— IndianPremierLeague (@IPL) May 12, 2019
The @ChennaiIPL restrict #MumbaiIndians to a total of 149/8 in Finals of the #VIVOIPL.
Will #CSK chase this down? pic.twitter.com/kVTcVqDnAqInnings Break!
— IndianPremierLeague (@IPL) May 12, 2019
The @ChennaiIPL restrict #MumbaiIndians to a total of 149/8 in Finals of the #VIVOIPL.
Will #CSK chase this down? pic.twitter.com/kVTcVqDnAq
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబయి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి నాలుగు ఓవర్లలోనే 45 పరుగులు చేసింది డికాక్ - రోహిత్(15) జోడి. అనంతరం ఓవర్ వ్యవధిలోనే వీరిద్దరూ పెవిలియన్ చేరారు. తర్వాత ముంబయి ఇన్నింగ్స్ నెమ్మదించింది. చివర్లో పొలార్డ్ (41), హార్దిక్ పాండ్య(16) చివర్లో కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
17 ఓవర్లకు 120 పరుగులే చేసింది ముంబయి. 18 ఓవర్లో పొలార్డ్, హార్దిక్ చెరో సిక్సర్ కొట్టి స్కోరు వేగం పెంచారు. 19 ఓవర్లో హార్దిక్‌తో పాటు రాహుల్ చాహర్నూ వెనక్కిపంపి ముంబయిని దెబ్బకొట్టాడు దీపక్ చాహర్. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసింది ముంబయి.