ETV Bharat / sports

INDW vs AUSW: 'ధోనీ నుంచి ఆ విషయం నేర్చుకోవాలనుంది' - ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

టాస్​ గెలవటం ఎలాగో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నట్లు భారత మహిళా క్రికెట్ జట్టు (indw vs ausw 2021) కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య డేనైట్​ టెస్టు ఆదివారం డ్రాగా (indw vs ausw result) ముగిసిన తర్వాత టాస్​పై మిథాలీ సరదాగా స్పందించారు.

Pink-ball Test ind vs aus
పింక్​ బాల్​ టెస్ట్
author img

By

Published : Oct 4, 2021, 10:30 AM IST

టాస్​ గెలవటం ఎలాగో ఎమ్​ఎస్​ ధోనీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నానని భారత మహిళల క్రికెట్​ జట్టు (indw vs ausw 2021) కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్​ టెస్టులో (ind vs aus pink ball test) టాస్​ ఓడినప్పటికీ తమ బృంద సభ్యులు ఆసీస్​పై పైచేయి (indw vs ausw test) సాధించారని చెప్పారు. టాస్​ తరచుగా కలిసిరాకపోయినా టీమ్ సభ్యులు సహకరిస్తున్నారని తెలిపారు. డేనైట్​ టెస్టు ఆదివారం డ్రాగా (indw vs ausw result) ముగిసిన తర్వాత టాస్​పై మిథాలీ సరదాగా స్పందించారు.

"తరచుగా టాస్​ ఓడటాన్ని రిపీట్ చేయకూడదనుకుంటున్నా. అయినా.. టీమ్ సభ్యులు మద్దతునిస్తున్నారు. బహుశా! నేనే మారాలనుకుంటా. టాస్​ ఎలా గెలవాలో ఎమ్​ఎస్ ధోనీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా."

-మిథాలీ రాజ్​, భారత మహిళా జట్టు కెప్టెన్

ఆస్ట్రేలియా-భారత్ మధ్య డేనైట్​ టెస్టు (indw vs ausw test 2021) ఆదివారం డ్రాగా ముగిసింది. మొదట బరిలోకి దిగిన భారత జట్టు మెరుగైన ఆటతీరును కనబరిచింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత అమ్మాయిల కంగారూ జట్టును కంగారు పెట్టారు. చివరి రోజైన ఆదివారం ఆట మలుపులు తిరిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 241/9 వద్ద డిక్లేర్‌ చేసింది. 136 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. 135/3తో డిక్లేర్‌ చేసి ప్రత్యర్థి ముందు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 15 ఓవర్లలో 36/2తో ఉన్న దశలో రెండు జట్లు డ్రాకు అంగీకరించాయి. వర్షం కారణంగా తొలి రెండు రోజుల్లో కలిపి 80 ఓవర్లకు పైగా ఆట సాధ్యపడలేదు.

ఇదీ చదవండి: T20 World Cup: గుడ్​న్యూస్​.. స్డేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి

ఎలాగో పోటీలో లేము.. అందుకే అలా: కేన్‌ విలియమ్సన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.