ETV Bharat / sports

జట్టులో నుంచి రోహిత్​ను తప్పించడమా.. కోహ్లీ రియాక్షన్​ ఇది

టీమ్​ఇండియాలో రోహిత్​ శర్మది కీలక పాత్ర. హిట్​మ్యాన్​ అన్న బిరుదు అంత సులభంగా రాలేదు. అయితే టీ20 ప్రపంచకప్​లో ఆదివారం పాకిస్థాన్​తో మ్యాచ్​లో(ind vs pak t20) రోహిత్​ ఒక్క పరుగు కూడా కొట్టకుండానే ఔట్​ అయ్యాడు. ఒక్క మ్యాచ్​తో అతడి సామర్థ్యాన్ని తక్కువ చేయగలమా? కానీ మ్యాచ్​ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓ పాకిస్థానీ విలేకరి అడిగిన ప్రశ్నకు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఒక్కసారి షాక్​ అయ్యాడు. ఆ తర్వాత తనదైన శైలిలో జవాబిచ్చాడు. అసలేం జరిగిందంటే?

ind vs pak t20
విరాట్​
author img

By

Published : Oct 25, 2021, 8:37 AM IST

ఆదివారం జరిగిన భారత్​- పాకిస్థాన్​ టీ20 మ్యాచ్​ అనంతరం మీడియా సమావేశం జరగ్గా.. ఓ పాకిస్థానీ విలేకరి అడిగిన ప్రశ్న సారధి విరాట్​ కోహ్లీకి షాక్​ ఇచ్చింది. 'జట్టు కూర్పుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇషాన్​ కిషన్​ బాగా ఆడుతున్నాడు. వార్మప్​ మ్యాచ్​లలో రాణించాడు. అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే.. రోహిత్​ కన్నా బాగా ఆడేవాడు అని మీరు అనుకుంటున్నారా?' అని అడిగాడు. రోహిత్​ శర్మను పక్కనపెట్టడం అన్న మాట వినేసరికి కోహ్లీ ముఖకవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. 'రోహిత్​ శర్మను జట్టులో నుంచి తీసేయడమా.. ఇదేం ప్రశ్న?' అన్నట్టు ఆ విలేకరివైపు కోహ్లీ చూశాడు. ఆ తర్వాత తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

ind vs pak t20
ప్రశ్న విని కోహ్లీ రియాక్షన్​ ఇది..

"ఈ ప్రశ్న అడగడానికి చాలా ధైర్యం ఉండాలి. మీరేం అనుకుంటున్నారు సర్​? నాకు బలంగా కనిపించిన జట్టునే మైదానంలోకి దింపాను. మీరేం అనుకుంటున్నారు? అంతర్జాతీయ టీ20 మ్యాచ్​ల నుంచి రోహిత్​ శర్మను మీరు తొలగిస్తారా? రోహిత్​ను తప్పిస్తారా? భారత్​-పాకిస్థాన్​ ఆడిన చివరి మ్యాచ్​(2019 ప్రపంచకప్​​)లో రోహిత్​ ఏం చేశాడో మీకు గుర్తుంది కదా! వివాదాలు కావాలి అనుకుంటే ముందే చెప్పండి.. అందుకు తగ్గట్టుగానే జవాబు చెబుతాను" అంటూ విరాట్ నవ్వుకున్నాడు​.

ind vs pak t20
నవ్వుకుంటున్న కోహ్లీ..

2019 ప్రపంచకప్​లో పాకిస్థాన్​పై రోహిత్​ చెలరేగి ఆడాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ 140 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు ఆదివారం జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ చేతిలో టీమ్​ఇండియా ఘోరంగా ఓడిపోయింది. టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​.. 20ఓవర్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూర్తిగా స్వేచ్ఛగా ఆడారు పాకిస్థాన్​ ఆటగాళ్లు. ఆ తర్వాత లక్ష్యఛేదలో బ్యాటర్లు దుమ్ముదులిపారు. మొత్తం మీద భారత్​పై 10 వికెట్ల తేడాతో గెలిచారు. ప్రపంచకప్​లో భారత్​పై పాక్​కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.