ETV Bharat / sports

'కోహ్లీతో పోరు కోసం ఎదురుచూస్తున్నా'

కోహ్లీసేనను ఎదుర్కొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఇంగ్లాండ్​ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) అన్నాడు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు భారత్- ఇంగ్లాండ్​ మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

james anderson
జేమ్స్ అండర్సన్
author img

By

Published : Aug 4, 2021, 8:25 AM IST

టెస్ట్​ క్రికెట్​లో మేటి బ్యాట్స్​మన్​.. ఉత్తమమైన బౌలర్​ తలపడితే అభిమానులకు పండగే. ఇలాంటి వాటిల్లో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ- ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ ఆండర్సన్​ పోరు ఒకటి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాడుతూ ఉంటారు. మరికొద్ది గంటల్లో టీమ్​ఇండియాతో సిరీస్​ ప్రారంభంకానున్న నేపథ్యంలో విరాట్​తో పోరు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు ఆండర్సన్​.

విరాట్​ కోహ్లీ ప్రభావం టీమ్​పై తీవ్రంగా ఉంటుందని అండర్సన్​ పేర్కొన్నాడు. అయితే కోహ్లీ వికెట్​ మాత్రమే కాదని జట్టులోని ఇతర ఆటగాళ్ల వికెట్ తీయడం కూడా ముఖ్యమే అని అన్నాడు.

"బౌలర్లపై విరుచుకుపడాలని కోహ్లీ ఆశిస్తాడు. అది బౌలర్లకు ఛాలెంజింగ్​గా ఉంటుంది. కెప్టెన్​గా, బ్యాట్స్​మన్​గా కోహ్లీ ప్రభావం టీమ్​పై తీవ్రంగా ఉంటుంది. భారత్​తో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. ప్రపంచ ఉత్తమ బ్యాట్స్​మన్​ కోహ్లీ వికెట్​ నేను మాత్రమే తీయాల్సిన పనిలేదు. ఇతర ఆటగాళ్లు ఆయన వికెట్​ తీసినా ఫర్వాలేదు. కానీ విరాట్​తో పోరుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా."

--జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్​ పేసర్.

మరోవైపు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత టీమ్​ఇండియా ఆడబోతున్న తొలి సిరీస్​ ఇదే. ఈ సిరీస్​లో గెలిచి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ-2లో శుభారంభం చేస్తుందా? లేక ఇంగ్లాండ్​ గడ్డపై తేలిపోతుందా? అనేది చూడాల్సి ఉంది.

ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ బుధవారం(ఆగస్టు 4) మధ్యాహ్నం 3.30కు ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి:'అతడి బౌలింగ్​లో కోహ్లీ తడబడుతున్నాడు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.