ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021) ఈవెంట్ కోసం వివిధ దేశాల క్రికెట్ బోర్డులన్నీ తమ జట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం, వెస్టిండీస్, శ్రీలంక బోర్డులు తమ టీమ్‌లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక, వెస్టిండీస్ బోర్డులు తమ జట్లను విరివిగా ప్రకటించాయి.
శ్రీలంక జట్టులో(Sri Lanka T20 World Cup Squad) సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో కలిపి ఇందులో 15 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు ఆల్‌రౌండర్లు, ఐదుగురు బౌలర్లు ఉన్నారు.
అయితే టీ20 ప్రపంచకప్ సూపర్ టీ20 అర్హత సాధించని కారణంగా.. గ్రూప్ దశలో పోటీ పడనుంది. ఇందులో గెలిస్తే తప్ప టీ20 ప్రపంచకప్ ఆడేందుకు లంక జట్టు అర్హత సాధించదు.
శ్రీలంక బృందం: దసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డిసిల్వా (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేశ్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, చరత్ అసలంగా, వానిందు హసరంగ, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరా, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు మధుశంక, మహీశ్ తీక్షణ.
రిజర్వ్ ఆటగాళ్లు: లహిరు కుమార, బినుర ఫెర్నాండో, అకిల ధనుంజయ, పులిన తరంగ.
విండీస్ జట్టులో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(West Indies T20 World Cup Squad) పాల్గొనే తమ జట్టును ప్రకటించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. వెస్టిండీస్ జట్టులో ప్రధానంగా 15 మందిని ఎంచుకుని.. నలుగురు ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్‌పై అవకాశం ఇచ్చారు. కిరెన్ పొలార్డ్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించగా.. యువ క్రికెటర్ నికోలస్ పూరన్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించారు. సీనియర్ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో, ఆండ్రూ రస్సెల్, జాసన్ హోల్డర్లను జట్టులోకి తీసుకున్నారు.
వెస్టిండీస్ బృందం: కిరెన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్(వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఫాబియన్ ఆలెన్, రోస్టన్ ఛేజ్, ఆండ్రూ ఫ్లెచర్, షిమ్రోన్ హెట్మేయర్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెక్‌య్, రవీ రాంపాల్, ఆండ్రూ రస్సెల్, లెండ్ల్ సిమ్మన్స్, ఒసానే థామస్, హెడన్ వాల్ష్ జూనియర్.
రిజర్వ్ ఆటగాళ్లు: డారెన్ బ్రావో, కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసైన్.
ఇదీ చూడండి.. T20 వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు ఇవే