ETV Bharat / sports

ఈ సెలబ్రిటీలు తాగే 'నల్ల' నీళ్ల ధరెంతో తెలుసా? - virat kohli water cost

చాలామంది సినీ, క్రీడా సహా ఇతర ప్రముఖులు ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. వారు తాగే నీరుకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు. అయితే ఇంతకీ ఆ నీటి లీటర్​ ధర ఎంతో తెలుసా? తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే. ఇంతకీ ఎంతంటే?

kohli
కోహ్లీ
author img

By

Published : Sep 12, 2021, 9:54 AM IST

Updated : Sep 12, 2021, 1:58 PM IST

నీటికి రంగుండదు.. ఇది చిన్నప్పట్నుంచీ సైన్సు పాఠాల్లో బోధించే ప్రాథమిక విషయం. కానీ ఈ మధ్య 'బ్లాక్‌ వాటర్‌' అని ఓ కొత్తరకం నీళ్లొస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ దగ్గర్నుంచి శృతి హాసన్‌, మలైకా అరోరాలాంటి సెలబ్రిటీలు అందరూ ఆరోగ్యానికి మంచిదంటూ వీటిని తాగుతున్నారు. ఇంతకీ ఈ నీటి ధర ఎంతో తెలుసా? లీటరు సుమారు రూ.నాలుగు వేలట. 'అంత రేటా'.. అని ఆశ్చర్యపోకండి. అంతకుమించి ఖరీదైన నీళ్ల బాటిళ్లు కూడా ఉన్నాయి. అవెందుకంత ఖరీదో తెలుసుకోవాలనుకుంటున్నారా మరి.

అందుకే నల్లగా

ప్రపంచంలోనే ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో ఒకడిగా పేరుపొందిన విరాట్‌ కోహ్లీ తినే ఆహారమే కాదు, తాగే మంచినీళ్లు కూడా ప్రత్యేకమే. నీటిలో ఏముందీ.. స్వచ్ఛమైనవి ఏవైనా ఆరోగ్యానికి మంచివేగా అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే నీళ్లలోనూ బోలెడు రకాలున్నాయి. వాటిలో ఉండే ప్రత్యేకతలను బట్టి ధర కూడా పెరుగుతుంది. ప్రస్తుతం కోహ్లీ తాగే బ్లాక్‌ వాటర్‌ కూడా అలాంటిదే. ఈ ఆల్కలైన్‌ నీళ్లలో పీహెచ్‌ స్థాయులు మామూలు నీటిలో కన్నా ఎక్కువట. 70కి పైగా ఖనిజ లవణాలూ ఉంటాయి. అందుకే, ఇవి నల్లగా కనిపిస్తాయి. ఈ నీటిని తాగితే డీహైడ్రేషన్‌ అయ్యే అవకాశం చాలా తక్కువట.

kohli
కోహ్లీ

ఎన్నో లాభాలు

"ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బరువు అదుపులో ఉంటుంది. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఒత్తిడి దరిచేరదు. బీపీ, మధుమేహం, శరీరంలో కొవ్వు స్థాయులు ఎక్కువగా ఉండేవారికీ ఈ నీళ్లు మంచి ఫలితాలను ఇస్తాయి" అని చెబుతున్నారు నిపుణులు. అయితే, ఇన్ని లాభాలను పొందాలంటే లీటరు బ్లాక్‌ వాటర్‌కు రూ.3 వేల నుంచి 4 వేలు చెల్లించాల్సిందే. అయినా సెలెబ్రిటీలు వెనక్కి తగ్గడం లేదులెండి. శృతి హాసన్‌, మలైకా అరోరా, ఊర్వశి రౌతెలా.. లాంటి తారలతో పాటు ఇంకా హాలీవుడ్‌ తారలూ, క్రీడా ప్రముఖులు చాలామంది ఈ నీటిని తాగుతున్నారు. విరాట్‌ కోహ్లీ ఇంతకుముందు 'ఎవియాన్‌' అని మరో కంపెనీ నీటిని తాగేవాడు. అవి కూడా లీటరు రూ.3000. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌కు చెందిన మార్కిస్‌ అనే వ్యక్తి రోజూ వాకింగ్‌కి వెళ్తూ స్థానికంగా 'ఎవియాన్‌ లెస్‌ బెయిన్స్‌' దగ్గరున్న నీటి బుగ్గలోని నీరు తాగేవాడట. అప్పట్నుంచీ అతడి కిడ్నీ, లివర్‌ సమస్యలు నయం కావడం మొదలుపెట్టాయట. అది కాస్తా ప్రచారం కావడం వల్ల ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది.

ఇక, ప్రపంచంలోనే ఖరీదైన నీళ్ల విషయానికొస్తే..

కోనా నిగరి.. లీ. రూ.40వేలు

హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే ఈ ‘కోనా నిగరి’ నీరు ప్రపంచంలోనే ఖరీదైంది. 750మి.లీ ఉండే బాటిల్‌ ధర సుమారు రూ.30 వేలు మరి. ప్రత్యేక పద్ధతుల్లో ఈ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతు నుంచి వస్తాయి కాబట్టి, ఇవి స్వఛ్చంగా ఉండడం వల్ల ఖనిజ లవణాలూ ఎక్కువగా ఉంటాయట. అందుకే, ఈ నీటిని తాగితే బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనీ అంటారు. అయినా, ఇంత ధర ఉంటే ఎవరు కొంటారు.. అంటారా..? ఒక్క జపాన్‌కే రోజుకు సుమారు లక్ష బాటిళ్లు దిగుమతి అవుతున్నాయట.

malika
మలైకా అరోరా

ఫిల్లికొ.. లీ. రూ.16 వేలు

జపాన్‌లోని కొబె పర్వతాల దగ్గర ఉన్న నునొబికి నీటి బుగ్గల నుంచి సేకరించిన 'ఫిల్లికొ' స్వచ్ఛమైన నీటికి ప్రాచుర్యం పొందింది. ఇక, సెలెబ్రిటీలు బయటికి వెళ్లినప్పుడు వారి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌ కూడా అలంకరణ వస్తువు కిందే లెక్క. అందుకే, ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్లతో అందంగా ముస్తాబు చేసి, మూతలను రాణి, రాజుల కిరీటాల్లా తయారు చేస్తారు.

స్వాల్‌బాడ్‌ లీ. రూ.13వేలకు పైనే..

ఉత్తర ధ్రువానికి అతి దగ్గరలో, నార్వేలోని స్వాల్‌బాడ్‌ ప్రాంతంలోని మంచు కొండలను కరిగించి ఈ నీటిని సేకరిస్తున్నారు. వీటిలో నాలుగువేల ఏళ్ల కిందటి ఐస్‌బర్గ్‌లు కూడా ఉంటాయట. ఫైన్‌ వాటర్‌ సొసైటీ ప్రపంచంలోనే రుచికరమైన నీళ్లలో ఒకటిగా ఈ నీటిని గుర్తించింది.

ఓ అమెజాన్‌ లీ. రూ.8 వేలు

బ్రెజిల్‌కి చెందిన 'ఓ అమెజాన్‌ ఎయిర్‌ వాటర్‌' కంపెనీ ఏకంగా అమెజాన్‌ అడవుల్లోని గాలి నుంచి నీటిని తయారు చేసి అమ్ముతోంది. అమెజాన్‌ వర్షారణ్యాలు ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలికి చిరునామా. అక్కడి తడి గాలిని చల్లటి కాయిల్స్‌ గుండా వెళ్లేలా చెయ్యడం వల్ల అది నీరుగా మారుతుందట.

ఇవేకాదు, బ్లింగ్‌ హెచ్‌టూవో (లీ.రూ.4000), నెవాస్‌(లీ.రూ.3,600), వీన్‌(లీ. రూ.2,240)... లాంటి కంపెనీలూ ఖరీదైన నీటిని అమ్ముతున్నాయి.

ఇదీ చూడండి: గోడను బాది, హెల్మెట్​ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్

Last Updated : Sep 12, 2021, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.