ఇంగ్లాండ్ గడ్డపై ఘన విజయం. అదీ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో మరపురాని గెలుపు. ఇక సిరీస్‌లో తిరుగులేదు.. ఈసారి సిరీస్ మనదే అనుకున్న టీమ్ఇండియా అభిమానులు. ఆ ఉత్సాహంతోనే లీడ్స్ మ్యాచ్‌లో లీనమైపోయారంతా. కానీ వారి ఆశ నిరాశైంది. గెలుపేమో కానీ ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే కోహ్లీసేన డైహార్డ్ ఫ్యాన్స్ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. మరికొందరైతే 'ఈ మ్యాచ్ జరగలేదు. మేం చూడలేదు' అంటూ.. ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు అప్రతిష్టను, అభిమానులకు నిరాశను మిగిల్చిన లీడ్స్ మ్యాచ్ హైలెట్స్ చూద్దాం.
-
An unbelievable effort from our bowlers! 💪
— England Cricket (@englandcricket) August 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Full highlights 👇
">An unbelievable effort from our bowlers! 💪
— England Cricket (@englandcricket) August 28, 2021
Full highlights 👇An unbelievable effort from our bowlers! 💪
— England Cricket (@englandcricket) August 28, 2021
Full highlights 👇
ఈ మ్యాచ్‌లో శనివారం 212/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 66 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం వల్ల భారత బ్యాట్స్‌మెన్ ఒక్క సెషన్ కూడా నిలవలేకపోయారు. చివరికి 278 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో సిరీస్ 1-1 తేడాతో సమమైంది. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2న లండన్ వేదికగా ప్రారంభంకానుంది.