ETV Bharat / sports

టీమ్​ఇండియా టెస్టు​​లు ఫిక్సింగ్.. స్పందించిన ఐసీసీ! - అల్​ జజీరా డాక్యుమెంటరీ

'క్రికెట్స్​ మ్యాచ్​ ఫిక్సర్స్​' పేరుతో విడుదలైన డాక్యుమెంటరీని ఐసీసీ తోసిపుచ్చింది. అదంతా ఊహాజనితమని.. ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఆధారాల్లేవని స్పష్టం చేసింది.

icc, India's Tests against England, Australia were not fixed
ఐసీసీ, 'ఆ టెస్ట్​​లు ఫిక్సింగ్ కాలేదు.. ఆ డాక్యుమెంటరీ తప్పు'
author img

By

Published : May 17, 2021, 7:25 PM IST

భారత్​ వేదికగా గతంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్​ల్లో ఫిక్సింగ్​ జరిగినట్లు అల్​జజీరా న్యూస్​ ఛానల్​ రూపొందించిన డాక్యుమెంటరీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తోసిపుచ్చింది. ఆ డాక్యుమెంటరీ మొత్తం ఊహాజనితంగా ఉందని తెలిపింది. అదంతా ఆగమ్యగోచరమమని పేర్కొంది.

2016లో చెన్నైలో జరిగిన ఇంగ్లాండ్​-భారత్​ టెస్టుతో పాటు 2017లో రాంచీ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-భారత్​ మ్యాచ్​లోనూ ఫిక్సింగ్ జరిగినట్లు ఆ డాక్యుమెంటరీలో పేర్కొంది అల్​ జజీరా. దీనిని 'క్రికెట్స్​ మ్యాచ్​ ఫిక్సర్స్​' పేరుతో విడుదల చేసింది.

ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు ఐసీసీ తెలిపింది. కానీ వారిపై అభియోగాలు మోపడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇందులో అనీల్ మున్నావార్​ అనే బుకీ ప్రస్తావన ఉంది. అతడు చాలా మ్యాచ్​ల్లో ఫిక్సింగ్​కు ప్రయత్నించినట్లు ఉంది. ఇందులో రెండు మ్యాచ్​లు భారత్​ వేదికగా విరాట్ కోహ్లీ నాయకత్వంలో జరిగాయని డాక్యుమెంటరీలో తెలిపాడు.

ఇదీ చదవండి: 'విజయ్.. నీ బ్యాట్​ కంటే నోరే ఎక్కువ మాట్లాడుతుంది'

అయితే ఇందులో పాల్గొన్న వారి గురించి ఐసీసీ ఎటువంటి విషయాలు వెల్లడించలేదు. అయినప్పటికీ.. పాకిస్థాన్ క్రికెటర్ హసన్​ రాజా, శ్రీలంక ఆటగాళ్లు తరంగ ఇండికా, తరిందు మెండిస్, ముంబయి ఫస్ట్​ క్లాస్​ క్రికెటర్ రాబిన్ మోరిస్ ఇందులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఐసీసీ దర్యాప్తు..

అల్​ జజీరా చేసిన ఈ ఆరోపణలపై ఐసీసీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఆ డాక్యుమెంటరీ తప్పని స్పష్టం చేసింది. ఈ రెండు టెస్టు మ్యాచ్​ల్లో ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని తేల్చిచెప్పింది. డాక్యుమెంటరీ రూపకల్పనలో పాల్గొన్న వారెవరు.. ఆ ప్రొగ్రామ్​ను ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలపై ప్రధానంగా దృష్టి సారించింది ఐసీసీ.

ఇదీ చదవండి: లొంగిపోవడానికి సిద్ధపడ్డ రెజ్లర్​ సుశీల్​ కుమార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.