ETV Bharat / sports

WTC Final: 'మన కుర్రాళ్లు మానసికంగానూ సిద్ధమే!' - టెస్టు ఛాంపియన్​షిప్​

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్(WTC Final)​ కోసం టీమ్​ఇండియా సన్నద్ధతకు తక్కువ సమయమే ఉంది. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ఫీల్డింగ్​ కోచ్(fielding coach of india)​ ఆర్​.శ్రీధర్​ అన్నారు. టీమ్ఇండియా ఆటగాళ్లంతా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఏడాది మొత్తం జట్టులోని క్రికెటర్లంతా ఫిట్​గా ఉంటారని వెల్లడించారు.

India's fielding coach feels team will be ready mentally for the challenge in UK
WTC Final: 'మన కుర్రాళ్లు మానసికంగానూ సిద్ధమే!'
author img

By

Published : Jun 2, 2021, 1:41 PM IST

Updated : Jun 2, 2021, 2:18 PM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final)​కు టీమ్‌ఇండియా మానసికంగా సిద్ధంగా ఉందని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌(fielding coach of india)​ అన్నారు. సాధనకు సమయం లేకపోవడం పట్ల ఆందోళన లేదని పేర్కొన్నారు. అయితే ప్రత్యర్థి జట్టులోనూ బలమైన క్రికెటర్లు ఉన్నారని వెల్లడించారు.

"సాధనకు సమయం లేనందుకు ఆందోళనేమీ లేదు. పూర్తి సన్నద్ధత లేకపోవడం మాకు అనుకూలమే. ఎందుకంటే మా ఆటగాళ్లు మానసికంగా మరింత సన్నద్ధంగా ఉంటారు. అంటే గాయపడ్డప్పుడు ఆడినట్లుగా అన్నమాట. మా క్రికెటర్లు నెలల తరబడి క్రికెట్‌ ఆడుతూనే ఉన్నారు. ఐపీఎల్‌ వాయిదా పడటం దురదృష్టకరం. క్వారంటైన్లో కుర్రాళ్లు దేహదారుఢ్యం పెంచుకుంటారు. ఫైనల్‌కు తాజాగా సిద్ధమవుతారు."

- ఆర్​.శ్రీధర్​, టీమ్ఇండియా ఫీల్డింగ్​ కోచ్​

"మా క్రికెటర్లంతా ప్రొఫెషనల్స్‌. ఏడాది సాంతం ఫిట్‌నెస్‌తో ఉంటారు. క్వారంటైన్‌ సమయంలో వారితో ప్రత్యేకమైన కసరత్తులేమీ చేయించడం లేదు. ఆటగాళ్లకు ఏవి ఎలా పనిచేస్తాయో తెలుసని నమ్ముతా. అవసరమనిపిస్తేనే జోక్యం చేసుకుంటాను. నేను వాళ్లతోనే ఉంటానని తెలుసు కాబట్టి నా సాయం అవసరమైతే కోరతారు. ఇక ప్రత్యర్థి జట్టులో కొందరిపైనే మేం దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్‌ బలమైన జట్టు. తటస్థ వేదిక కాబట్టి వారికీ, మాకూ ఒకేలాంటి అవకాశాలు ఉంటాయి" అని శ్రీధర్‌ తెలిపారు.

కొవిడ్‌-19(Covid-19) వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని శ్రీధర్‌ అన్నారు. తనకు తోచిన రీతిలో కొవిడ్‌ బాధితులకు సాయం చేస్తున్నానని వెల్లడించారు. కోహ్లీ, విహారి, పాండ్య, ఇంకా మరెంతో మంది క్రికెటర్లు చేయూతనందించడం గర్వకారణమని వెల్లడించారు.

ఇదీ చూడండి: WTC final: టీమ్​ఇండియాకు మాజీ క్రికెటర్​ హెచ్చరిక

Last Updated : Jun 2, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.