Womens Emerging Aisa Cup 2023 : టీమ్ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2023లో అద్భుత విజయం నమోదు చేశారు. మొదటి మ్యాచ్‌లోనే సత్తా చూపించి.. ప్రత్యర్థిని చిత్తు చేశారు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన భారత అమ్మాయిలు.. ఆకాశమే హద్దుగా ఆడి 34 పరుగులకే ఆ జట్టును కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ బ్యాటర్లలో ఒక్కరే రెండంకెల స్కోరును నమోదు చేశారు. దీంతో టీమ్ఇండియా-ఏ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
35 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. కేవలం 5.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ (2) పరుగులకే పెవిలియన్ చేరగా.. ఉమా ఛెత్రి (15 బంతుల్లో 16 పరుగులు; 2x4), తెలుగు అమ్మాయి గొంగడి త్రిష (13 బంతుల్లో 19 పరుగులు; 2x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు సునాయాస విజయం అందించారు.
-
Off to a winning start! 👏🏻👏🏻
— BCCI Women (@BCCIWomen) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India 'A' complete a clinical 9️⃣-wicket win in their opening game of #WomensEmergingTeamsAsiaCup 👏🏻👏🏻 #ACC
📸 Asian Cricket Council
Scorecard▶️https://t.co/pp2vCKsh9r… pic.twitter.com/WS1IQF3fXc
">Off to a winning start! 👏🏻👏🏻
— BCCI Women (@BCCIWomen) June 13, 2023
India 'A' complete a clinical 9️⃣-wicket win in their opening game of #WomensEmergingTeamsAsiaCup 👏🏻👏🏻 #ACC
📸 Asian Cricket Council
Scorecard▶️https://t.co/pp2vCKsh9r… pic.twitter.com/WS1IQF3fXcOff to a winning start! 👏🏻👏🏻
— BCCI Women (@BCCIWomen) June 13, 2023
India 'A' complete a clinical 9️⃣-wicket win in their opening game of #WomensEmergingTeamsAsiaCup 👏🏻👏🏻 #ACC
📸 Asian Cricket Council
Scorecard▶️https://t.co/pp2vCKsh9r… pic.twitter.com/WS1IQF3fXc
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ జట్టు.. 14 ఓవర్లలో 34 పరుగులు చేసి కుప్పకూలింది. ఓపెనర్ మరికో హిల్ (14) తప్ప మిగతా వాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లు హాంకాంగ్ బ్యాటర్లపై విరుచుకు పడ్డారు. కెప్టెన్ శ్వేతా షెహ్రావత్ తమపై ఉంచిన నమ్మకాన్ని భారత బౌలర్లు నిలబెట్టుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే టిటాస్ సాధు (1), మన్నత్ కశ్యప్ (2) వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
మొదట్లోనే గట్టి దెబ్బ తగిలిన హాంకాంగ్.. ఏ దశలోనూ కోలుకునేటట్టు కనిపించలేదు. ఆ తర్వాత యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ చెలరేగిపోయింది. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి.. కేవలం రెండు పరుగులే ఇచ్చి.. ఏకంగా ఐదు వికెట్లు తీసుకుంది. దీంతో హాంకాగ్ జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్‌తో పాటు మన్నత్ కశ్యప్ కూడా రెండు ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంది. మరో బౌలర్ పర్శావి చోప్రా రెండు వికెట్లు తీసింది.
-
Take a bow Shreyanka Patil 🙌🙌
— BCCI Women (@BCCIWomen) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
An excellent performance with the ball 👏👏#WomensEmergingTeamsAsiaCup | #ACC | @shreyanka_patil pic.twitter.com/44oiD5ImIu
">Take a bow Shreyanka Patil 🙌🙌
— BCCI Women (@BCCIWomen) June 13, 2023
An excellent performance with the ball 👏👏#WomensEmergingTeamsAsiaCup | #ACC | @shreyanka_patil pic.twitter.com/44oiD5ImIuTake a bow Shreyanka Patil 🙌🙌
— BCCI Women (@BCCIWomen) June 13, 2023
An excellent performance with the ball 👏👏#WomensEmergingTeamsAsiaCup | #ACC | @shreyanka_patil pic.twitter.com/44oiD5ImIu
ఇదే మొదటి ఎడిషన్..
Womens Emerging Asia Cup 2023 Schedule : మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్‌ను ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) నిర్వహిస్తోంది. మహిళల క్రికెట్‌కు ఆదరణ లభించాలనే ఉద్దేశంతో ఏసీసీ ఈ టీ20 టోర్నీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జూన్ 12 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వీటిని గ్రూప్-ఏ, గ్రూప్-బీగా విభజించారు. గ్రూప్-ఏలో.. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో హాంకాంగ్, మలేషియా, నేపాల్, యూఏఈ ఉన్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రతి టీమ్.. మిగతా జట్లతో ఒక మ్యాచ్‌లో ఆడుతుంది. ఇలా గ్రూప్ మ్యాచ్‌లు అయిపోయేసరికి రెండు గ్రూపుల్లో టాప్ 2 జట్లు సెమీ ఫైనల్లో తలపడతాయి. అందులో గెలిచిన జట్లు టైటిల్ కోసం పోరాడుతాయి.
-
First edition of the Women's Emerging Asia Cup starts tomorrow.
— Female Cricket (@imfemalecricket) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Predict the finalists. #CricketTwitter 📸 @ACCMedia1 pic.twitter.com/BwNszXcTfY
">First edition of the Women's Emerging Asia Cup starts tomorrow.
— Female Cricket (@imfemalecricket) June 11, 2023
Predict the finalists. #CricketTwitter 📸 @ACCMedia1 pic.twitter.com/BwNszXcTfYFirst edition of the Women's Emerging Asia Cup starts tomorrow.
— Female Cricket (@imfemalecricket) June 11, 2023
Predict the finalists. #CricketTwitter 📸 @ACCMedia1 pic.twitter.com/BwNszXcTfY