ETV Bharat / sports

ఆ పని చేస్తేనే పృథ్వీ షాకు జట్టులో చోటు!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. బరువు ఎక్కువగా ఉన్న కారణంగానే ఆయనకు చోటు దక్కలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

prithvi shaw
పృథ్వీ షా
author img

By

Published : May 8, 2021, 2:13 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ బ్యాట్స్​మన్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. అయితే.. ఓవర్​ వెయిట్ ఉన్న కారణంగా సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. బరువు తగ్గితే జట్టులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపాయి.

గతేడాది పేలవ ప్రదర్శనతో భారత జట్టులో స్థానం కోల్పోయిన షా.. 2021విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్​లో తిరిగి ఫామ్​ అందుకున్నాడు. అత్యధిక పరుగులతో చెలరేగిపోయాడు. అయినప్పటికీ బీసీసీఐ అతడిని పక్కన పెట్టడం అందర్నీ అశ్చర్యపరిచింది.

టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం 25 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది బీసీసీఐ.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకుర్‌, ఉమేశ్‌ యాదవ్‌.

కేఎల్ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా ఫిట్‌నెస్‌ పరీక్షలు నెగ్గితే ఇంగ్లాండ్‌కు పయనమవుతారు. ఇక కొత్తగా నలుగురు యువ క్రికెటర్లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. వారిలో అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జున్‌ నాగ్‌వస్వల్లా ఉన్నారు.

ఇదీ చదవండి:ఆట- దాతృత్వంలో కమిన్స్​ స్టైలే వేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.