ETV Bharat / sports

2022లో భారత క్రీడారంగంలో మెరుపులు.. మలుపులు.. ఇవే

2022 భారత క్రీడా అభిమానులకు మిశ్రమ అనుభూతులను అందించింది. చరిత్రలో నిలిచిపోయే విజయాలు కొన్ని.. మర్చిపోవాల్సిన పరాజయాలు మరికొన్ని. అత్యుత్తమ ఆటతీరుతో సత్తాచాటింది కొందరైతే.. ఊరించి ఉసూరుమనిపించింది మరికొందరు. మరి.. ఈ ఏడాది భారత క్రీడా రంగంలో ప్రధాన పరిణామాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం.

indian players sports achievements 2022
భారత క్రీడాకారులు
author img

By

Published : Dec 31, 2022, 6:54 AM IST

ఇదివరకెప్పుడూ సాధ్యం కాని ఘనతలు.. గతంలో చూడని విజయాలు.. మైదానంలో అథ్లెట్ల మెరుపులు.. భారత క్రీడా రంగంలో మలుపులు ఓ వైపు! పడిపోతున్న టీమ్‌ఇండియా క్రికెట్‌ ప్రమాణాలు.. కొనసాగుతున్న ప్రపంచకప్‌ నిరీక్షణ.. ఆటల్లో పెరుగుతున్న వివాదాలు మరో వైపు! ఇలా.. 2022 భారత క్రీడా అభిమానులకు మిశ్రమ అనుభూతులను అందించింది. చరిత్రలో నిలిచిపోయే విజయాలు కొన్ని.. మర్చిపోవాల్సిన పరాజయాలు మరికొన్ని. అత్యుత్తమ ఆటతీరుతో సత్తాచాటింది కొందరైతే.. ఊరించి ఉసూరుమనిపించింది మరికొందరు. మరి.. ఈ ఏడాది భారత క్రీడా రంగంలో ప్రధాన పరిణామాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం.

రోహిత్​ శర్మ

టీమ్‌ఇండియా.. ప్చ్‌
2022లో క్రికెట్లో మాత్రం నిరాశ తప్పలేదు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఓటమితో టీమ్‌ఇండియా ఈ ఏడాదిని ఆరంభించింది. ఆ పరాజయంతో టెస్టుల్లోనూ కెప్టెన్సీ పగ్గాలను కోహ్లి వదిలేశాడు. దీంతో పూర్తిస్థాయి కెప్టెన్‌గా ప్రయాణం మొదలెట్టిన రోహిత్‌ శర్మ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జట్టు మంచి ప్రదర్శనే చేసినప్పటికీ.. ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో వరుసగా పాకిస్థాన్‌, శ్రీలంక చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై శతకంతో కోహ్లి సెంచరీ నిరీక్షణ ముగించడం ఒక్కటే సానుకూలాంశం. ఆ తర్వాత భారీ అంచనాలతో పొట్టి కప్పు బరిలో దిగిన భారత్‌.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడింది. అయితే ఆ టోర్నీలో పాకిస్థాన్‌పై కోహ్లి (82 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయి జట్టు పరాభవం పాలైంది. నామమాత్రమైన చివరి వన్డేలో ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీతో రికార్డులు కొల్లగొట్టాడు. ఈ ఏడాది టీమ్‌ఇండియాకు ఉత్సాహాన్నిచ్చే విషయం ఏమైనా ఉందంటే.. అది సూర్యకుమార్‌ ఫామే. టీ20ల్లో ఈ ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌ పరుగుల వరద పారించాడు. 2022లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా (31 ఇన్నింగ్స్‌ల్లో 1164) నిలిచాడు.

ఇక అండర్‌-19లో భారత ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కుర్రాళ్లు మరోసారి కప్పు కొట్టారు. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో యువ భారత్‌ గెలిచింది. అమ్మాయిల విషయానికి వస్తే కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల టీ20 టోర్నీలో భారత్‌ రజతం గెలిచింది. ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడింది. కానీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌ అంచనాలు అందుకోలేకపోయింది. గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. మూడు ఫార్మాట్లలోనూ పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకు మ్యాచ్‌ ఫీజు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. మరోవైపు ఐపీఎల్‌ మీడియా హక్కులు ఏకంగా రూ.48 వేల కోట్లకు అమ్ముడవడం విశేషం. 10 జట్లతో సాగిన ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే గుజరాత్‌ టైటాన్స్‌ విజేతగా నిలిచింది. ఇక ఇటీవల ఐపీఎల్‌ మినీ వేలంలో సామ్‌ కరన్‌ (రూ.18.5 కోట్లు) లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత ఆటగాళ్లు

బ్యాడ్మింటన్‌లో చరిత్ర
భారత బ్యాడ్మింటన్‌లో 2022 ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ప్రపంచ వేదికపై మన షట్లర్లు ఎన్నో టైటిళ్లు సాధించినప్పటికీ.. ఒక్క లోటు మాత్రం అలాగే ఉండేది. ఈ ఏడాదితో అది తీరిపోయింది. 73 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ భారత్‌ మొట్టమొదటి సారి థామస్‌ కప్‌ విజేతగా నిలిచింది. మే 15న జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్‌ ఇండోనేషియాపై గెలిచి చరిత్ర సృష్టించింది. లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి లాంటి షట్లర్లు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. చైనా, మలేసియా, ఇండోనేషియా, జపాన్‌, డెన్మార్క్‌ తర్వాత ఈ ట్రోఫీ గెలిచిన ఆరో దేశంగా భారత్‌ నిలిచింది. మరోవైపు పీవీ సింధు కామన్వెల్త్‌ క్రీడల పసిడి కలను చేరుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పురుషుల డబుల్స్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారత జోడీగా సాత్విక్‌- చిరాగ్‌ రికార్డు నమోదు చేశారు. కామన్వెల్త్‌ క్రీడల్లోనూ ఈ జోడీ స్వర్ణం గెలిచింది. కామన్వెల్త్‌ క్రీడల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.

మిథాలీ రాజ్‌

దిగ్గజాల వీడ్కోలు
భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ దారి చూపిన మిథాలీ రాజ్‌.. తన సుదీర్ఘ కెరీర్‌కు ఈ ఏడాదే ముగింపు పలికింది. రెండు దశాబ్దాలకు పైగా భారత అమ్మాయిల క్రికెట్‌ జట్టును అన్నీ తానై నడిపిన ఆమె జూన్‌ 8న ఆటకు వీడ్కోలు పలికింది. ‘లేడీ సచిన్‌’గా కీర్తి గడించిన ఆమె ఎన్నో రికార్డులు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల (10,868) రికార్డు ఆమె పేరు మీదే ఉంది. వన్డేల్లోనూ అత్యధిక పరుగులు (7,805) ఆమెవే. మరోవైపు మిథాలీతో పాటు కలిసి నడిచిన దిగ్గజ పేసర్‌ జులన్‌ గోస్వామి కూడా ఆటకు గుడ్‌బై చెప్పేసింది. సెప్టెంబర్‌లో ఆమె రిటైర్మెంట్‌ ప్రకటించింది. వన్డేల్లో అత్యధిక వికెట్ల (255) రికార్డు ఆమె ఖాతాలోనే ఉంది.

మీరాబాయి చాను

మీరా జోరు
వెయిట్‌లిఫ్టింగ్‌ సంచలనం మీరాబాయి చాను అంచనాలను నిలబెట్టుకుంటూ సాగుతోంది. నిలకడగా రాణిస్తున్న ఆమె.. ఈ ఏడాది కూడా సత్తాచాటింది. డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. 2017లో స్వర్ణం నెగ్గిన ఆమె.. ఈ సారి వెండి పతకం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకాన్ని ముద్దాడింది. మరోవైపు అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా అమన్‌ సెహ్రావత్‌ (57 కేజీలు) చరిత్ర సృష్టించాడు. ఆరంభ ఎఫ్‌ఐహెచ్‌ మహిళల నేషన్స్‌ హాకీ కప్‌లో భారత్‌ టైటిల్‌ గెలిచింది. ప్రపంచ క్యాడెట్‌ జూడో ఛాంపియన్‌సిప్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా లిథోయి చనంబం చరిత్రకెక్కింది.

దిగ్గజ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

బాక్సింగ్‌ ముఖచిత్రంగా..
దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ రిటైర్మెంట్‌ దిశగా సాగుతుండడంతో.. ఇక మహిళల బాక్సింగ్‌లో భారత సూపర్‌ స్టార్‌ ఎవరు? అనే ప్రశ్నకు తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ సమాధానంగా నిలుస్తోంది. రింగ్‌లతో పంచ్‌లతో చెలరేగుతున్న ఆమె భారత మహిళల బాక్సింగ్‌ ముఖ చిత్రంగా మారింది. మే 19న 52 కేజీల విభాగంలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అదే దూకుడు కొనసాగిస్తూ కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పసిడి సొంతం చేసుకుంది. జాతీయ ఛాంపియన్‌గానూ మెరిసింది. టేబుల్‌ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం ముద్దాడింది. శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది.

భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా

పతకాల వేటలో జావెలిన్‌ వీరుడు
గతేడాది ఒలింపిక్స్‌లో పసిడి గెలిచి భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. 2022లోనూ అతని ఈటె పతకాల వేటలో.. కొత్త రికార్డుల బాటలో దూసుకెళ్లింది. జులై 24న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. అంతే కాకుండా సెప్టెంబర్‌లో డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ టైటిల్‌తో మరో రికార్డు నెలకొల్పాడు. ఆ టైటిల్‌ దక్కించుకున్న తొలి భారత అథ్లెట్‌ అతడే. భారత అథ్లెటిక్స్‌ను మరోస్థాయికి చేరుస్తూ.. ప్రపంచ వేదికపై అతను త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూనే ఉన్నాడు.

భారత ఆటగాళ్లు

కామన్వెల్త్‌ క్రీడల్లో కేక
ఈ సారి షూటింగ్‌ లేకపోయినా కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ క్రీడల్లో భారత్‌ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు ఖాతాలో వేసుకుంది. రెజ్లింగ్‌, టీటీ, వెయిట్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌లో మనవాళ్లు గొప్పగా రాణించడమే అందుకు కారణం. భారత అభిమానులకు పెద్దగా పరిచయం లేని లాన్‌బౌల్స్‌లో మన అథ్లెట్లు సత్తాచాటడం విశేషం. మహిళల ఫోర్‌ విభాగంలో స్వర్ణంతో భారత్‌ ఈ క్రీడల చరిత్రలో ఈ క్రీడాంశంలో తొలి పసిడి గెలిచింది. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ఎల్దోస్‌, అబ్దుల్లా వరుసగా పసిడి, రజతం నెగ్గి రికార్డు నెలకొల్పారు. టీటీ దిగ్గజం శరత్‌ కమల్‌ ఏకంగా మూడు స్వర్ణాలు, ఓ రజతం సొంతం చేసుకోవడం విశేషం. జెరెమీ లాల్రినుంగా, అచింత షూలి, బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, దీపక్‌ పునియా, రవి కుమార్‌, వినేశ్‌ ఫొగాట్‌ వంటి అథ్లెట్లు పసిడి కాంతులు పంచారు.

భారత్​ చెస్​ ఆటగాళ్లు

ఆతిథ్యంతో.. ఆటతో
98 ఏళ్ల చరిత్రలో భారత్‌ మొట్టమొదటి సారి చెస్‌ ఒలింపియాడ్‌కు ఆతిథ్యమిచ్చింది. జులై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఈ టోర్నీ జరిగింది. చెన్నై మొత్తం నలుపు, తెలుపు రంగులతో నిండిపోయింది. ఆతిథ్యంతో పాటు ఆటతోనూ భారత్‌ అదరగొట్టింది. ఓపెన్‌ (గుకేశ్‌, నిహాల్‌, ప్రజ్ఞానంద, అధిబన్‌, సాధ్వాని), మహిళల (హంపి, హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి) విభాగాల్లో దేశానికి కాంస్య పతకాలు దక్కాయి. మరోవైపు అక్టోబర్‌లో అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌కూ భారత్‌ వేదికగా నిలిచింది.

నిషేధాలు ఆరోపణలు
గతమెంతో ఘనమైన భారత ఫుట్‌బాల్‌పై ఈ ఏడాది మచ్చ పడింది. బయట వర్గం జోక్యం కారణంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై ఫిఫా ఆగస్టు 15న నిషేధం విధించింది. కానీ ఫిఫా డిమాండ్లకు తగినట్లుగా ఏఐఎఫ్‌ఎఫ్‌ చర్యలు తీసుకోవడంతో నిషేధాన్ని ఎత్తేసింది. వయసు మోసం ఆరోపణలతో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డోపింగ్‌లో అథ్లెట్లు కమల్‌ప్రీత్‌ కౌర్‌ (డిస్కస్‌త్రో), ధనలక్ష్మీ (స్ప్రింట్‌), శివ్‌పాల్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో), ఐశ్వర్య బాబు (ట్రిపుల్‌ జంప్‌) పట్టుబడడం కలకలం రేపింది. మరోవైపు స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ డోపింగ్‌లో దోషిగా తేలి రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.