ETV Bharat / sports

2028 ఒలింపిక్స్​లో టీమ్​ఇండియా!

2028లో లాస్​ ఏంజిల్స్​ వేదికగా జరగనున్న ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేరిస్తే.. భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగుతాయని బీసీసీఐ వెల్లడించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు అధికారులు.

bcci, Los Angeles Olympics
ఒలింపిక్స్​లో టీమ్​ఇండియా, బీసీసీఐ
author img

By

Published : Apr 17, 2021, 7:02 AM IST

లాస్​ ఏంజెల్స్​ ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేరిస్తే పతకం కోసం భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ నిర్ణయించింది. శుక్రవారం వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల జట్టు ఆడనుంది. 2028 ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేరిస్తే భారత పురుషుల, మహిళల జట్లు బరిలో దింపాలని బోర్డు నిర్ణయించింది.

ఇదీ చదవండి: ఆ క్షణాల్ని డబ్బుతో వెలకట్టలేం: విరుష్క

"మహిళల టీ20 ఛాలెంజర్ (మహిళల ఐపీఎల్​) సిరీస్​లో ఈసారి కూడా మూడు జట్లు బరిలో దిగనున్నాయి. ఆ తర్వాత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. ఏడాది ఆఖర్లో మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్​లు ఆడుతుంది" అని బీసీసీఐ అధికారి తెలిపాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవాళీ క్రికెట్​పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు!

ఇదీ చదవండి: ఆసియా రెజ్లింగ్​: వినేశ్‌, దివ్య, అన్షులకు స్వర్ణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.