ETV Bharat / sports

యువరాజ్ టు సెహ్వాగ్​ - ఈ స్టార్​ క్రికెటర్లకు నో ఫేర్​వెల్​!

ఏ వ్యక్తికైనా తన రంగంలో చేసిన సేవలకు ఘనంగా ముగింపు పలకాలనుకుంటారు. సహాచరులు సైతం అతని జీవిత కాలంలో గుర్తుండిపోయేలా గ్రాండ్​ ఫేర్​వెల్ ఇవ్వాలనుకుంటారు. క్రికెట్​లోనూ అంతే తమ ఆట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఆ ప్లేయర్లు రిటైర్​మెంట్​ ప్రకటించినప్పుడు గ్రాండ్​గా ఫేరవెల్​ అందుకుంటుంటారు. అయితే ఏటువంటి వీడ్కొలు లేకుండా తమ కెరీర్​ను ముగించిన స్టార్​ క్రికెటర్లు ఉన్నారు. ఇంతకీ వారేవరంటే ?

Indian Cricketers Who Did not Get Farewell

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 7:55 AM IST

Updated : Jan 13, 2024, 12:54 PM IST

Indian Cricketers Who Did not Get Farewell : ఇండియాలో క్రికెట్​కు ఓ ప్రత్యేకమైన క్రేజ్​ ఉంది. ఇందులోని ప్లేయర్లును తమ అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తుంటారు. ఆ క్రీడాకారుల ఆట తీరును చూసి మురిసిపోతుంటారు. అయితే ఏ ఫీల్డ్​కైనా రిటైర్​మెంట్​ అనేది ఓ కీలక సందర్భం. ఎంతటి ప్లేయరైన సరే తమ ఆటకు ఇంక వీడ్కోలు పలకాల్సిందే. అయితే క్రికెట్​లో మాత్రం ఇది ఎంతో బాధాకరమైన విషయం. తమ అభిమాన ప్లేయర్లు ఇకపై బ్యాట్ పట్టరు అని తెలుసుకున్న ఫ్యాన్స్​ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయినప్పటికీ తమ స్టార్స్ సెకెండ్ ఇన్నింగ్స్​కు శుభాకాంక్షలు తెలుపుతుంటారు.

ఇక క్రికెటర్లు రిటైర్​మెంట్ ప్రకటించిన సమయంలో తమ అభిమానులు భావోద్వేగానికి లోనవుతూ తమ ప్లేయర్లకు ఘనంగా వీడ్కోలు పలుకుతుంటారు. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్​ కూడా ఆయనకు గ్రాండ్ ఫేర్​వెల్ ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్​ ప్లేయర్లు తమ గేమ్​కు గ్రాండ్​గా వీడ్కోలు పలికారు. అయితే టీమ్ఇండియాకు చెందిన ఓ ఐదుగురు గొప్ప క్రికెటర్లు మాత్రం ఏటువంటి వీడ్కోలు లేకుండానే సింపుల్​గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతకీ వారెవరంటే ?

గౌతమ్​ గంభీర్ : 2007, 2011 ప్రపంచకప్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్​ బ్యాటర్ సరైన వీడ్కోలు లేకుండానే తన కెరీర్​ను ముగించాడు. 2016లో ఇంగ్లాండ్​తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన గంభీర్, సరిగ్గా రెండేళ్ల తర్వాత దిల్లీ రంజీ టీమ్ తరపున మ్యాచ్ ఆడి తన రిటైర్​మెంట్​ను ప్రకటించాడు.

యువరాజ్ సింగ్ : తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆల్ రౌండర్ యువరాజ్​ సింగ్ కూడా సింపుల్​గానే గేమ్​కు వీడ్కోలు పలికాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫి జట్టులో స్థానం పొందినప్పటికీ ఆ తర్వాత కొనసాగలేకపోయాడు. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశాడు.

వీరేంద్ర సెహ్వగ్​ : దశాబ్దకాలం పైగా భారత్ క్రికెట్​కు సేవలందించి తనదైన శైలిలో ఫ్యాన్స్ మనసులో నిలిచాడు స్టార్​ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్​. అయితే ఈ రైట్ హాండర్ తన కెరీర్​కు సరైన ముగింపు పలకలేకపోయాడు. 2013లో చివరి వన్డే ఆడిన సెహ్వగ్ ఆ తర్వాత రెండేళ్ల పాటు దేశవాలీ మ్యాచ్​లను ఆడి 2015లో కెరీర్​ను ముగించాడు.

హర్భజన్ సింగ్ : తన స్పిన్ మాయాజాలంతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్. 2016 లో చివరి వన్డే ఆడిన హర్బజన్ ఆ తర్వాత 2021 వరకూ ఐపీఎల్ మ్యాచ్​లు ఆడి తన కెరీర్​కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఆయన క్రికెట్​ క్రిటిక్​గా, కామెంటేటర్​గా క్రికెట్ ఫీల్డ్​కు సేవలందిస్తున్నాడు.

జహీర్ ఖాన్ : 2011 తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన జహీర్ ఖాన్ ఆ తర్వాత ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడలేదు. దీంతో 2015లో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన జహీర్, 2017 వరకూ ఐపీఎల్ ఆడాడు.

Last Updated : Jan 13, 2024, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.