ETV Bharat / sports

క్రికెట్​కు గుడ్​బై చెప్పిన స్టార్ క్రికెటర్​ - రాబిన్ ఉతప్ప రిటైర్మెంట్

robin uthappa retirement
robin uthappa retirement
author img

By

Published : Sep 14, 2022, 7:46 PM IST

Updated : Sep 14, 2022, 8:26 PM IST

19:43 September 14

క్రికెట్​కు గుడ్​బై చెప్పిన స్టార్ క్రికెటర్​

టీమ్ ​ఇండియా సీనియర్ క్రికెటర్​ రాబిన్ ఉతప్ప సంచలన​ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. తన 20 ఏళ్ల కెరీర్‌లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
" నేను క్రికెట్​ ఆడటం ప్రారంభించి 20 ఏళ్ల అవుతుంది. ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, నా రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా. నేను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్​ టీమ్​లకు నా ధన్యవాదాలు. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. ఈ ప్రయాణం నన్ను మనిషిగా పరిపూర్ణం చేసింది. అయితే వీటన్నిటికీ వీడ్కోలు పలికే సమయం వచ్చింది. అందుకే క్రికెట్​ నుంచి రిటైర్​మెంట్ ప్రకటిస్తున్నా. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభించబోతున్నా." అని ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

36 ఏళ్ల ఉతప్ప.. తన కెరీర్​లో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6 హాఫ్‌ సెంచరీ సాయంతో 934 పరుగులు, టీ20ల్లో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 249 పరుగులు సాధించాడు. ఉతప్ప తన ఐపీఎల్‌ కెరీర్‌లో 205 మ్యాచ్‌ల్లో 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 130.3 స్ట్రయిక్‌ రేట్‌తో 4952 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి: బీసీసీఐ రాజ్యాంగ సవరణకు సుప్రీం ఓకే.. గంగూలీ, షా '2.0' షురూ

మాజీ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు.. ముంబయి ఇండియన్స్​ ఫ్రాంచైజీ నిర్ణయం

Last Updated : Sep 14, 2022, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.