భారత క్రికెటర్లకు ఏప్రిల్ 15న వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది బీసీసీఐ. నాలుగు విభాగాల్లో మొత్తం 28 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు దక్కాయి. గాయం కారణంగా గతేడాది ఎక్కువ మ్యాచులు ఆడని హార్దిక్ పాండ్య 'ఎ' గ్రేడ్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. జట్టులో అతని ప్రాధాన్యాన్ని గుర్తించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మహ్మద్ సిరాజ్, శుభమన్ గిల్.. 'సి' గ్రేడ్ కాంట్రాక్టు దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: 'టోక్యో ఒలింపిక్స్ రద్దు ఆలోచనే లేదు'
అయితే.. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లిన నటరాజన్.. అనుహ్యంగా టెస్టులు, వన్డేలు, టీ 20ల్లో అరంగేట్రంతోనే సంచలన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయినా నట్టూకు బీసీసీఐ కాంట్రాక్టు దక్కలేదు. దీనికి ఓ కారణం ఉంది. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్టు దక్కాలంటే భారత్ తరఫున కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా 10 టీ20 మ్యాచులు ఆడి ఉండాలి. నటరాజన్ ఒక టెస్టు, 2 వన్డేలు, 4 టీ20లు మాత్రమే ఆడాడు. ఈ కారణంగానే అతడికి బీసీసీఐ కాంట్రాక్టు దక్కలేదు.
ఇక.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.. 'ఎ+' గ్రేడ్‌లో యథావిధిగా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం అందనుంది.
ఇదీ చదవండి: బోణీ కోసం హైదరాబాద్.. ఆత్మవిశ్వాసంతో ముంబయి