ETV Bharat / sports

IND vs WI: మూడో వన్డేలోనూ విండీస్​ చిత్తు.. 3-0తో సిరీస్​ భారత్​ కైవసం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్‌.. 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా
విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా
author img

By

Published : Jul 28, 2022, 3:24 AM IST

Updated : Jul 28, 2022, 6:47 AM IST

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయపరంపర కొనసాగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 26 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (42; 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్‌ కింగ్‌ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేశారు. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. తొలుత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (98; 98 బంతుల్లో 7x4, 2x6) రాణించగా.. తర్వాత బౌలర్లు చాహల్‌ 4/17, సిరాజ్‌ 2/14, శార్దూల్‌ 2/17 తమ పని పూర్తిచేశారు. దీంతో విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్‌.. కరీబియన్‌ జట్టుపై వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి.. ఈ రికార్డు నెలకొల్పిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.

సిరాజ్‌ అదిరే ఆరంభం..: భారీ ఛేదనకు దిగిన విండీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చాడు. తన తొలి ఓవర్‌లోనే మేయర్స్‌(0), బ్రూక్స్‌ (0)లను డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. తర్వాత షై హోప్‌ (22; 33 బంతుల్లో 1x6), బ్రెండన్‌ కింగ్‌ నిలకడగా ఆడి కాసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్‌ విడదీశాడు. అతడు వేసిన 9.5 ఓవర్‌కు హోప్‌ స్టంపౌటయ్యాడు. తర్వాత కెప్టెన్‌ పూరన్‌ క్రీజులోకి రాగా.. కింగ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించేలా కనిపించాడు. కానీ, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో కింగ్‌ బౌల్డవ్వడంతో కరీబియన్‌ జట్టు 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కార్టీ (5)తో కలిసి కాస్త నిలకడగా ఆడిన పూరన్‌ సైతం.. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 103 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. తర్వాత టెయిలెండర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో విండీస్‌ ఓటమి ఖాయమైంది.

తొలి శతకం కోల్పోయిన శుభ్‌మన్‌..: అంతకుముందు టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ ధావన్‌ (58; 74 బంతుల్లో 7x4), యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (98 నాటౌట్‌; 98 బంతుల్లో 7x4, 2x6) రాణించి తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీంతో జట్టు భారీ స్కోర్‌ సాధించడానికి పునాదులు వేశారు. అయితే, అర్ధ శతకం చేసి నిలకడగా ఆడుతున్న ధావన్‌ను.. హేడెన్‌ వాల్ష్‌ ఔట్‌ చేశాడు. అతడు వేసిన 22.5 ఓవర్‌కు షాట్ఆ‌డబోయిన టీమ్‌ఇండియా సారథి.. పూరన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ (44; 34 బంతుల్లో 4x4, 1x6) క్రీజులోకి రాగా.. తర్వాతి ఓవర్‌ పూర్తవ్వగానే వర్షం కురిసింది. అప్పటికి భారత్‌ 24 ఓవర్లకు 115/1తో నిలిచింది. శుభ్‌మన్‌ (51), శ్రేయస్‌ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యాక ఆటను చెరో 40 ఓవర్లకు కుదించారు.

శ్రేయస్‌తో కలిసి ధాటిగా..: ఈ క్రమంలోనే శ్రేయస్‌, శుభ్‌మన్‌ రెచ్చిపోయారు. 8 ఓవర్లలోనే వీరిద్దరూ 86 పరుగులు జోడించి రెండో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం జోడించారు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని హోసీన్‌ విడదీశాడు. శ్రేయస్‌ అర్ధ శతకానికి చేరువైన వేళ 32.2 ఓవర్‌కు భారీ షాట్‌ ఆడబోయి కీమోపాల్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 199 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే సూర్యకుమార్‌ యాదవ్‌ (8; 6 బంతుల్లో 1x4) సైతం ఔటయ్యాడు. వాల్ష్‌ బౌలింగ్‌లో బ్రూక్స్‌ క్యాచ్‌ అందుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ (6 నాటౌట్‌; 7 బంతుల్లో)తో కలిసి శుభ్‌మన్‌ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్‌ వన్డేల్లో తొలి శతకం సాధించేలా కనిపించాడు. కానీ, 36 ఓవర్లు పూర్తయ్యాక మరోసారి వర్షం కురవడంతో రెండోసారి ఆటను నిలిపివేశారు. వర్షం నిలిచిపోయాక భారత ఇన్నింగ్స్‌ను ముగించి.. డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో విండీస్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257గా నిర్దేశించారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 28, 2022, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.