టీమ్ఇండియా, శ్రీలంక పర్యటనకు షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. ఈ ఏడాది జులైలో ఇరుజట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ జరగనుందని వెల్లడించాడు. అయితే ఈ పర్యటనకు సారథి కోహ్లీ, రోహిత్ శర్మ గైర్హాజరవుతారని అన్నాడు. ఆగస్టు 4న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ సిరీస్ కోసం వారు సన్నద్ధమవుతుండటం వల్ల ఈ పర్యటనకు హాజరుకాలేరని చెప్పాడు. చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాతియా, చేతన్ సకారియా, దేవదత్ పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఈ పర్యటనలో ఆడే అవకాశముంది.
దీంతోపాటు నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను నిర్వహించడంపై నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని గంగూలీ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'దేవ్‌దత్ పడిక్కల్‌కు ఇంకా టైముంది'