India W Tour Of Bangladesh 2023 : ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో.. టీమ్ఇండియా ఓటమి పాలైంది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు.. 40 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ పతనాన్ని శాసించిన బంగ్లాదేశ్ బౌలర్ మరుఫా అక్తర్ (4 వికెట్లు) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
153 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ స్మృతి మందానా మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత భారత్ క్రమంగా వికెట్లు పారేసుకుంది. స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ ప్రియా పునియా, కెప్టెన్ హర్మన్, యస్తికా భాటియా, జెమిమా నలుగురు ఔట్ అవ్వడం వల్ల టీమ్ఇండియా మరింత ఒత్తిడిలో పడింది. దీంతో భారత్ 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఆశలన్నీ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మపైనే పెట్టుకున్న టీమ్ఇండియా.. 91 పరుగుల వద్ద ఆమె కూడా పెవిలియన్ చేరడం వల్ల బంగ్లాదేశ్ విజయం లాంఛనమైంది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడం వల్ల 35.5 ఓవర్లలో 113 పరుగులకు టీమ్ఇండియా ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరూఫా అక్తర్ 4, రబియా ఖాన్ 3, నహిదా అక్తర్, సుల్తానా తలో వికెట్ తీశారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం జరగనుంది.
-
Bangladesh win the 1st ODI.#TeamIndia will look to bounce back in the next game.
— BCCI Women (@BCCIWomen) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/qnZ6yqtRxy… #BANvIND pic.twitter.com/DT38pOwVBM
">Bangladesh win the 1st ODI.#TeamIndia will look to bounce back in the next game.
— BCCI Women (@BCCIWomen) July 16, 2023
Scorecard - https://t.co/qnZ6yqtRxy… #BANvIND pic.twitter.com/DT38pOwVBMBangladesh win the 1st ODI.#TeamIndia will look to bounce back in the next game.
— BCCI Women (@BCCIWomen) July 16, 2023
Scorecard - https://t.co/qnZ6yqtRxy… #BANvIND pic.twitter.com/DT38pOwVBM
అంతకుముందు టాస్ గెలిచిన టీమ్ఇండియా మొదట బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే వర్షం కారణంగా నిర్వహకులు మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. మొదటి నుంచే టీమ్ఇండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థి బ్యాటర్లను 43 ఓవర్లలో 152 పరుగులకే కట్టడి చేశారు. 39 పరుగులు చేసిన బంగ్లా కెప్టెన్ సుల్తానాయే ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ 4 వికెట్లతో సత్తా చాటగా.. దేవిక వైద్య 2, దీప్తీ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
Ind W vs Ban W Debut Players : ఈ మ్యాచ్‌తో అనూష బారెడ్డి, అమన్‌జోత్ కౌర్‌లు టీమ్ఇండియా తరఫున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్ నాలుగు వికెట్లు నేలకూల్చి ఔరా అనింపించింది.
Ind W vs Ban W T20 2023 : అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.