India Vs Westindies 3rd T20 : వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధించింది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన భారత్ సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. తర్వాత 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టును ఓపెనర్లు నిరాశ పర్చారు. యశస్వీ జైస్వాల్ ఒకటి, శుభ్‌మన్ గిల్ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు.
సూర్యకుమార్ 83 పరుగులతో సత్తాచాటాడు. సూర్యకుమార్ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సారథి హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.తిలక్ వర్మతో కలిసి 17.5 ఓవర్లలో జట్టును విజయాన్ని అందించాడు. తిలక్ 49 పరుగులతోనూ, పాండ్యా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
-
For his breathtaking match-winning knock in the third #WIvIND T20I, Suryakumar Yadav bags the Player of the Match award 🙌 🙌
— BCCI (@BCCI) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/3rNZuAiOxH #TeamIndia pic.twitter.com/vFQQYFUKOC
">For his breathtaking match-winning knock in the third #WIvIND T20I, Suryakumar Yadav bags the Player of the Match award 🙌 🙌
— BCCI (@BCCI) August 8, 2023
Scorecard ▶️ https://t.co/3rNZuAiOxH #TeamIndia pic.twitter.com/vFQQYFUKOCFor his breathtaking match-winning knock in the third #WIvIND T20I, Suryakumar Yadav bags the Player of the Match award 🙌 🙌
— BCCI (@BCCI) August 8, 2023
Scorecard ▶️ https://t.co/3rNZuAiOxH #TeamIndia pic.twitter.com/vFQQYFUKOC
కళ్లు చెదిరే షాట్లతో సూర్య మెరుపులు..
Surya Kumar Yadav Ind VS WI : ప్రావిడెన్స్ వేదికగా జరిగిన మూడో టీ20లో మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో విజృంభించాడు. 360 డిగ్రీ ఫామ్‌ను కొనసాగించిన స్కై.. కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను అలరించాడు. ఫోర్లు, సిక్స్‌లను వరుసగా బాదుతూ జట్టును విజయం పథంలోకి నడిపించాడు.
అయితే ఛేదనలో భారత ఓపెనర్లిద్దరూ విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ స్థానంలో వచ్చిన యశస్వి జైస్వాల్ (1) తొలి ఓవర్లోనే క్యాచ్ ఔట్ కాగా.. అయిదో ఓవర్లో గిల్ (6) పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి మన స్కోరు 34. కానీ తొలి బంతి నుంచే సూర్య జోరు మొదలైంది. జైస్వాల్ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కై తొలి రెండు బంతుల్లో వరుసగా 4, 6 కొట్టి ఒక్కసారిగా అందరిలోనూ ఆశలు నింపాడు. తిలక్ వర్మది కూడా కీలక ఇన్నింగ్సే. తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ తిలక్ మరోసారి సత్తా చాటాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను చక్కని షాట్లతో బౌండరీ దాటించాడు.
ఇక అయిదో ఓవర్లో తిలక్ రాకతో సూర్యకు మంచి జోడీ దొరికినట్లయింది. ఓ వైపు తిలక్ సంయమనాన్ని ప్రదర్శిస్తూ, చక్కగా స్ట్రైక్‌రొటేట్ చేస్తూ సూర్యకు సహకరిస్తుండగా.. అతడు తనదైన శైలిలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. మెకాయ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ దంచేశాడు. ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతిని అతడు బౌలర్ తలమీదుగా అలవోకగా సిక్స్ కొట్టిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. షెపర్డ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు సాధించిన సూర్య.. 23 బంతుల్లోనే అర్ధశతకాన్ని తన ఖాతాలోకి వేసుకున్నాడు. షెపర్డ్ వేసిన మరో ఓవర్లో ఓ స్లో ఆఫ్ కటర్‌ను అతడు తనదైన స్కూప్‌తో సిక్స్‌గా మలిచి ఔరా అనిపించాడు. ఆ తర్వాతి బంతిని ఏకంగా బౌండరీ దాటించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సూర్య తన జోరును కొనసాగించడం వల్ల భారత్ 12 ఓవర్లలో 114/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో జోసెఫ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన సూర్య.. సెంచరీ చేసేలానే కనిపించాడు. కానీ అదే ఊపులో మరో షాట్ ఆడబోయి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. అయితే చివరి ఏడు ఓవర్లలో భారత్ స్కోర్ చేయాల్సింది 37 పరుగులే కావడం వల్ల భారత్ కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది.
Tilak Varma Ind Vs WI : ఇక సూర్య స్థానంలో తిలక్ జట్టును గెలిపించే బాధ్యతలు అందుకుని.. హార్దిక్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 16వ ఓవర్లో షెపర్డ్ లెంగ్త్ బంతిని పుల్‌తో తిలక్ స్టాండ్స్‌లోకి తరలిస్తే.. హార్దిక్ ఓ ఫోర్ కొట్టాడు. చివరి నాలుగు ఓవర్లలో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ ఇక గెలుస్తుందన్న ధీమాతో ఉంది. సూర్యతో మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించిన తిలక్.. హార్దిక్ (20 నాటౌట్)తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
-
Surya-kamaal Yadav 🤩🔥#WIvIND #JioCinema #SabJawaabMilenge pic.twitter.com/GHcdT5ybsk
— JioCinema (@JioCinema) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Surya-kamaal Yadav 🤩🔥#WIvIND #JioCinema #SabJawaabMilenge pic.twitter.com/GHcdT5ybsk
— JioCinema (@JioCinema) August 8, 2023Surya-kamaal Yadav 🤩🔥#WIvIND #JioCinema #SabJawaabMilenge pic.twitter.com/GHcdT5ybsk
— JioCinema (@JioCinema) August 8, 2023
రోహిత్ గారాలపట్టికి 'తిలక్' హాఫ్ సెంచరీ అంకితం.. పంత్ రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాదీ
Ind Vs WI T20 : టీమ్ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?