ETV Bharat / sports

IND Vs WI : విండీస్​ జట్టులో యంగ్​ప్లేయర్స్​.. మరి భారత్​కు పోటీనిస్తారా..? - వెస్టిండీస్​ టూర్​ భారత్​ స్క్వాడ్​

WI vs IND Test 2023 : రేపటి(జులై 12)నుంచి భారత్​-వెస్టిండీస్​ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విండీస్​ జట్టు మెంటార్‌ బ్రియాన్‌ లారా.. వెస్టిండీస్​ జట్టులోని యువఆటగాళ్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏమన్నాడంటే..

WI vs IND Test 2023
విండీస్​ జట్టులో వాళ్లు తప్ప అందరూ కొత్తవాళ్లే.. మరి భారత్​కు పోటీనిస్తారా..?
author img

By

Published : Jul 11, 2023, 4:40 PM IST

WI vs IND Test 2023 : వెస్టిండీస్​ క్రికెట్​ టీమ్​లో ఐదారుగురు తప్ప మిగతా వాళ్లందరూ యువ ఆటగాళ్లే. ఇప్పుడిప్పుడే జట్టులోకి వచ్చి రాణిస్తున్న క్రికెటర్లే. ఈ క్రమంలో ఎవరి ఆటతీరు ఎలా ఉంటుందో కొన్ని మ్యాచులు ఆడితే గానీ ఒక అంచనాకి రాలేం. మరి ఈ సమయంలో రేపటి(జులై 12)నుంచి జరగబోయే టెస్ట్​ సిరీస్​లో వీళ్లందరూ ఏ మేర రాణిస్తారో ఓ సారి చూడాలి.

ఇదిలా ఉంటే 'విండీస్​ జట్టులోని యంగ్​ ప్లేయర్స్​ అందరూ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తారు. వీరందరూ తప్పకుండా భారత్‌కు గట్టి పోటీనిస్తారు.' అంటూ విండీస్‌ క్రికెట్‌ జట్టు మెంటార్‌ బ్రియాన్‌ లారా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే లారా చేసిన ఈ కామెంట్స్​ కేవలం జట్టులోని ఆటగాళ్లల్లో మానసిక ధైర్యం నింపడం సహా వారిని ఉత్సాహపరచడానికి మాత్రమేనని పలువురు మాజీలు అంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్‌ను ఎదుర్కోవడం విండీస్​కు అంత తేలికైన విషయమేం కాదు.

భారత్​ బలం వీరే..
భారత క్రికెట్​ జట్టుకున్న పెద్ద బలం ఏంటంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు మంచి ఫామ్​లో ఉన్న యంగ్​ ప్లేయర్స్​ ఉండటమే. విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, శుభమన్​ గిల్​, అజింక్యా రహానే వంటి మేటి బ్యాటర్లతో పాటు మహ్మద్​ సిరాజ్​ నేతృత్వంలోని పేస్ దళంలో జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్‌ సైని, ముకేశ్‌ కుమార్‌ వంటి టాలెంటెడ్ ​బౌలర్లూ ఉన్నారు. మరి ఇంతటి కట్టుదిట్టమైన టీమ్​కు.. జరగబోయే టెస్ట్​, టీ20తో పాటు వన్డే మహా సమరంలో​​ విండీస్ ఆటగాళ్లు ఏ మేర పోటీనిస్తారో చూడాలి.

దాదాపు అంతా కొత్తవాళ్లే..
ఇప్పటి వరకు విండీస్, భారత్​ 98 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 22 మ్యాచ్‌లు, విండీస్‌ 30 మ్యాచుల్లో గెలిచాయి. మిగిలిన 46 డ్రాగా ముగిశాయి. ఇదంతా గతం.. 1990ల వరకు విండీస్‌ జట్టంటే ప్రత్యర్థికి వణుకు పుట్టేదే. రిచర్డ్స్‌, క్లైవ్‌లాయిడ్‌, సోబెర్స్‌, గ్రీనిడ్జ్‌, ఆంబ్రోస్‌, కోట్నీ వాల్ష్ వంటి భీకరమైన బ్యాటర్లు, బౌలర్లు ఆ జట్టులో ఉండేవారు. ఆ తర్వాత చంద్రపాల్, లారా, జిమ్మీ ఆడమ్స్, కార్ల్‌ హోపర్, శర్వాన్, బ్రావో, గేల్, రామ్‌దిన్‌ వంటి ఆటగాళ్లు విండీస్‌ క్రికెట్‌ చరిత్రను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం దాదాపు కొత్తవారితోనే మళ్లీ క్రికెట్‌ను ఆడుతున్నట్లుగా విండీస్‌ పరిస్థితి తయారైంది.

ఆ నలుగురు మాత్రమే..
విండీస్‌ జట్టులో నలుగురు మాత్రమే భారత ఆటగాళ్లకు పరిచయమున్న క్రికెటర్లు. వారిలో కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్ (85 టెస్టులు), జాసన్ హోల్డర్ (65 టెస్టులు), అల్జారీ జోసెఫ్‌ (28 టెస్టులు), కీమర్‌ రోచ్ (77 టెస్టులు) ఉన్నారు. భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా కొద్దికాలంలోనే ఫేమస్‌ అయిపోయాడు. అల్జారీ, కీమర్‌, జాసన్‌ వంటి ఆటగాళ్లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే. మిగతా ప్లేయర్స్​ ఎలా ఆడతారనేది టీమ్‌ఇండియా అంచనా వేయడం కాస్త కష్టమే. కాబట్టి భారత ఆటగాళ్లు దీనిని ఆసరాగా చేసుకొని సిరీస్​ను​ తేలికగా తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.