ETV Bharat / sports

IND VS WI 2023 : వరుణుడిదే విజయం.. సిరీస్​ టీమ్​ఇండియా సొంతం - ind vs wi test series 2023

IND VS WI 2023 : వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఫలితంగా సిరీస్​ను భారత్‌ 1-0 తేడాతో సొంతం చేసుకుంది.

IND VS WI 2023 :
IND VS WI 2023 : వరుణుడిదే విజయం.. సిరీస్​ టీమ్​ఇండియా సొంతం
author img

By

Published : Jul 25, 2023, 6:35 AM IST

Updated : Jul 25, 2023, 7:35 AM IST

IND VS WI 2023 : వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న టీమ్‌ఇండియా ఆశ నెరవేరలేదు. వరుణుడు అడ్డింకిగా మారి రెండో టెస్ట్​ విజయాన్ని ఎత్తుకెళ్లాడు. రెండో టెస్టులో ఆఖరి రోజు పూర్తిగా వర్షం పడటం వల్ల మ్యాచ్​ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్‌ 1-0తో టీమ్​ఇండియా సొంతమైంది.

వాస్తవానికి నాలుగో రోజే వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో ఆ రోజు దాదాపు ఒక సెషన్‌ ఆటకు నష్టం వాటిల్లింది. కనీసం చివరి రోజైనా వరుణుడు కరుణించాలని అభిమానులు కోరుకున్నారు. కానీ అదీ జరగలేదు. వర్షం పలుసార్లు పడుతూ ఆగుతూ ఉండటం వల్ల ప్లేయర్స్​ మైదానంలోకి రాలేకపోయారు. ఆఖరికి అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఫలితంగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

నాలుగో రోజు ఆదివారం 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది వెస్టిండీస్​.. చివరికి 76/2తో నిలిచింది. ఇక ఆ జట్టు విజయానికి ఇంకా 289 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (28), అరంగేట్ర బ్యాటర్‌ కిర్క్‌ మెకంజీ (0)లను అశ్విన్‌ (2/33) వరుస ఓవర్లలో పెవిలియన్​ చేర్చాడు. త్యాగ్‌నారాయణ్‌ (24), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (20 *) నాలుగో రోజు తమ జట్టుకు అండగా నిలిచారు. అయితే అప్పటికే ఈ సిరీస్‌లో భారత బౌలర్ల జోరు చూస్తుంటే.. సోమవారం ఐదో రోజు ఆటలో కనీసం రెండు సెషన్లు పడినా విండీస్‌ను దెబ్బతీసేవారు.

ind vs wi test series result : ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. 438 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన విండీస్‌ 255 పరుగులకే కుప్పకూలింది. భారత్‌కు 183 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్‌ శర్మ (57), ఇషాన్‌ కిషన్‌ (52 *) దూకుడుతో 24 ఓవర్లలోనే 2 వికెట్లకు 181 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది టీమ్​ఇండియా. యశస్వి జైస్వాల్‌ (38), శుభ్‌మన్‌ (29 నాటౌట్‌) కూడా బాగానే రాణించారు. ఫలితంగా.. ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్​. ఈ క్రమంలోనే విండీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి.... 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. చివరి రోజు భారీ వర్షం కురవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇకపోతే ఈ సిరీస్​ మొదటి మ్యాచ్‌లో.. భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ ఈ నెల గురువారం జరగనుంది.

ఇదీ చూడండి :

విరాట్ స్థానంలో నేనుంటే క్రికెట్ ఆడేవాడినే కాను : ఇషాంత్ శర్మ

టెస్టుల్లో 'డబుల్‌' డిజిట్స్‌.. ఫస్ట్​ బ్యాటర్‌గా రోహిత్ రికార్డ్​

Last Updated : Jul 25, 2023, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.