India Vs Sri Lanka World Cup 2023 : వన్డే ప్రపంచకప్లో భాగంగా ముంబయి వేదికగా శ్రీలంకతో టీమ్ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలుచుకున్న శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని మేం భావిస్తున్నాం. గత కొన్ని మ్యాచుల్లో ఆటగాళ్లు మంచి ప్రదర్శనే ఇచ్చారు. ఇదే ఉత్సాహంతో ఇవాళ కూడా పోరాడతాం. మా జట్టులో ఒక్క మార్పు ఉంది" అని కెప్టెన్ కుశాల్ వెల్లడించాడు.
12 ఏళ్ల తర్వాత..
ఇదే వేదికపై ప్రపంచకప్లో భారత్ - శ్రీలంక 12 ఏళ్ల కిందట తలపడ్డాయి. ఆ మ్యాచ్ యావత్ భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రత్యేకం. 2011 మెగాటోర్నీలో ఏప్రిల్ 2న ఫైనల్ జరగగా.. ఇప్పుడు నవంబర్ 2న మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఆ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గి.. రెండోసారి వన్డే ప్రపంచకప్ సాధించిన సంగతి తెలిలిందే.
IND vs SL Head To Head ODI World Cup : ఇక మెగాటోర్నీ హిస్టరీలో భారత్.. శ్రీలంకను 9సార్లు ఢీకొంది. ఇందులో ఇరు జట్లు సమానంగా చెరి 4సార్లు విజయం సాధించగా.. ఒక మ్యాచ్ మాత్రం రద్దైంది. ఈ పోరులో 373 అత్యధిక స్కోర్ కాగా.. 109 అత్యల్ప స్కోర్. టాప్ స్కోర్ భారత్ సాధించగా.. శ్రీలంక అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక తుది జట్టు : పాథున్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మ్యాథ్యూస్, దుషాన్ హేమంత, మహీష్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత్ చమీరా, దిల్షాన్ మదుషంక
16 సెంచరీలతో విరాట్ - రోహిత్ దండయాత్ర - లంకపై ఆ ఘనత సాధించింది వీరే
నేను కూడా బ్యాడ్ కెప్టెనే ప్రస్తుతం నా ఫోకస్ దానిపైనే! : రోహిత్ శర్మ