ETV Bharat / sports

లంకతో భారత్​ ఢీ.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు

India vs Sri Lanka: భారత జట్టును సొంతగడ్డపై ఓడించడం మహా మహా జట్లకే కష్టం. అలాంటిది ఇన్నేళ్లలో భారత గడ్డపై ఒక్కటంటే ఒక్క టెస్టు గెలవని, గత కొన్నేళ్లలో బాగా  బలహీన పడ్డ శ్రీలంక.. టీమ్‌ఇండియాను ఢీకొనబోతోందంటే మామూలుగా అభిమానుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ ప్రత్యర్థిని పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. సచిన్‌ తెందుల్కర్‌ తర్వాత ఆ స్థాయి బ్యాట్స్‌మన్‌గా, తర్వాతి తరంలో ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లీకిది వందో టెస్టు. రోహిత్‌ శర్మకు టెస్టు సారథిగా ఇదే తొలి మ్యాచ్‌. ఇక దాదాపు దశాబ్ద కాలంగా భారత మిడిలార్డర్‌ బాధ్యతల్ని మోస్తున్న పుజారా, రహానెల స్థానాల్లో యువ ఆటగాళ్లు ఆడబోతున్న తొలి మ్యాచ్‌ ఇది. మరి వందో టెస్టును చిరస్మరణీయం చేసుకునేలా విరాట్‌ ఒకప్పటి స్థాయిలో చెలరేగుతాడా? సారథిగా తన తొలి టెస్టులో రోహిత్‌ శర్మ తనదైన ముద్ర వేస్తాడా? యువ ఆటగాళ్లు జట్టు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా? అంచనాలకు భిన్నంగా లంకేయులు.. టీమ్‌ఇండియాకు దీటుగా నిలబడతారా?

author img

By

Published : Mar 4, 2022, 7:09 AM IST

Virat Kohli 100th Test
India vs Sri Lanka

India vs Sri Lanka: ఆధునిక క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడైన విరాట్‌ కోహ్లీ తన కెరీర్లో గొప్ప మైలురాయి ముంగిట నిలిచాడు. అతడి కెరీర్లో వందో టెస్టుకు రంగం సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో మొదలయ్యే తొలి మ్యాచ్‌తోనే అతనీ మైలురాయిని అందుకోబోతున్నాడు. ఒకప్పటి స్థాయిలో పరుగుల వరద పారించలేకపోతున్న విరాట్‌.. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో పూర్వపు ఫామ్‌ అందుకుని, రెండేళ్లకు పైగా అంతర్జాతీయ శతకం కోసం సాగుతున్న నిరీక్షణకు తెరదించుతాడన్నది అభిమానుల ఆశ! ఇక విరాట్‌ నుంచి మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్‌ శర్మ.. టెస్టుల్లో జట్టును నడిపించబోతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే సారథిగా సత్తా చాటిన రోహిత్‌.. సుదీర్ఘ ఫార్మాట్లో ఎలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరం. 2012 తర్వాత పుజారా, రహానెల్లో ఒక్కరూ లేకుండా భారత్‌ ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. ఫామ్‌తో తంటాలు పడుతున్న ఈ సీనియర్లు.. ఈ సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌, విహారి.. ఈ ముగ్గురిలో ఇద్దరు వారి స్థానాల్లో ఆడే అవకాశముంది. పుజారా, రహానెలను పక్కన పెట్టి భవిష్యత్‌ దిశగా కుర్రాళ్లకు అవకాశమిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం ఏమేర సఫలమవుతుందన్నది ఆసక్తికరం. సొంతగడ్డపై భారత్‌ను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాల్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆ జట్టు టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే.

తుది జట్టు ఎలా?: ఈ మ్యాచ్‌కు తుది జట్టు విషయంలో కొత్త కెప్టెన్‌ రోహిత్‌కు కొంచెం తలనొప్పి తప్పేలా లేదు. ఓపెనింగ్‌లో రోహిత్‌కు తోడుగా మామూలుగా అయితే మయాంక్‌ రావాలి. కానీ అతనూ ఈ మధ్య నిలకడగా ఆడట్లేదు. మరి అతడికే ఇంకో ఛాన్స్‌ ఇస్తారా.. లేక కొత్త ఆటగాడు ప్రియాంక్‌ పాంచల్‌ను ఆడిస్తారా అన్నది చూడాలి. కోహ్లీ ఎప్పట్లాగే నాలుగో స్థానంలో వస్తాడు. ఆరో స్థానంలో పంత్‌ ఆడతాడు. 3, 5 స్థానాలకు శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, విహారిల మధ్య పోటీ ఉంది. ఎక్కువగా విదేశాల్లోనే అవకాశాలు దక్కించుకున్న విహారి.. సొంతగడ్డపైనా సత్తా చాటడానికి ఎదురు చూస్తున్నాడు. అయితే శ్రేయస్‌, గిల్‌లే తుది జట్టులో ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. గిల్‌ మూడో స్థానంలో, శ్రేయస్‌ అయిదులో ఆడొచ్చని అంచనా వేస్తున్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత్‌ ఈ మ్యాచ్‌కు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశముంది. అశ్విన్‌, జడేజాలకు తోడు జయంత్‌ యాదవ్‌ లేదా కుల్‌దీప్‌ యాదవ్‌ను తుది జట్టులో చూడొచ్చు. ఇక బుమ్రాకు తోడుగా కొత్త బంతిని అందుకునేదెవరన్నది ఆసక్తికరం. రోహిత్‌ అనుభవజ్ఞుడైన షమిని ఎంచుకుంటాడో.. లేక గత మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేసిన సిరాజ్‌కు ఛాన్సిస్తాడో చూడాలి మరి. బ్యాటింగ్‌లో రోహిత్‌, కోహ్లి.. బౌలింగ్‌లో అశ్విన్‌, జడేజాలపై భారత్‌ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

వాళ్లకూ ఉన్నారు: ఒకప్పటితో పోలిస్తే శ్రీలంక జట్టు ఇప్పుడు బలహీనమే అయినా.. ఆ జట్టులో కొందరు ప్రతిభావంతులున్నారు. ఆ జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్‌పై సిరీస్‌ను 2-0తో నెగ్గి ఇక్కడికి వచ్చింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నెతో పాటు నిశాంక మంచి ఫామ్‌లో ఉన్నారు. అనుభవజ్ఞుడు మాథ్యూస్‌ ఫామ్‌ అందుకుంటే లంకకు పెద్ద బలమవుతాడు. బౌలర్లలో ఎంబుల్దేనియాపై భారత బ్యాట్స్‌మన్‌ ఓ కన్నేయాల్సిందే. అతను 13 మ్యాచ్‌ల్లో అయిదుసార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. మరో స్పిన్నర్‌ జయవిక్రమ ఆడిన మూడు టెస్టుల్లోనూ రాణించాడు. వీరికి తోడు ఆల్‌రౌండర్‌ ధనంజయతోనూ లంక స్పిన్‌ వేయించనుంది. పేస్‌ బాధ్యతలను లహిరు కుమార, సురంగ లక్మల్‌ పంచుకుంటారు. టీ20 సిరీస్‌లో భారత్‌ చేతిలో వైట్‌ వాష్‌కు గురైన లంక.. టెస్టుల్లో అయినా ఫలితం మార్చాలని పట్టుదలతో ఆడే అవకాశముంది.

తుది జట్లు (అంచనా)..

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌/ప్రియాంక్‌ పాంచల్‌, శుభ్‌మన్‌/విహారి, కోహ్లీ, శ్రేయస్‌, పంత్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌/జయంత్‌ యాదవ్‌, సిరాజ్‌/షమి, బుమ్రా.

శ్రీలంక: దిముత్‌ కరుణరత్నె (కెప్టెన్‌), తిరిమానె, నిశాంక, మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వా, చండిమాల్‌/అసలంక, డిక్వెలా (వికెట్‌ కీపర్‌), లక్మల్‌, ఎంబుల్దేనియా, జయవిక్రమ/విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార.

పిచ్‌

మొహాలి పిచ్‌ స్పిన్నర్ల స్వర్గధామమని గత ఏడాది ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరిగిన రెండు టెస్టులతోనే స్పష్టమైంది. ఆ మ్యాచ్‌ల్లో అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ ఎలా విజృంభించారో గుర్తుండే ఉంటుంది. లంకతో తొలి టెస్టు పిచ్‌ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. మ్యాచ్‌ సాగే కొద్దీ బంతి బాగా తిరుగుతుంది. భారత్‌ అశ్విన్‌, జడేజాలకు తోడుగా మరో స్పిన్నర్‌నూ ఆడించే అవకాశముంది. స్పిన్నర్లకే కాక బ్యాట్స్‌మెన్‌కూ ఈ పిచ్‌ నుంచి సహకారం ఉంటుంది.

20

భారత్‌లో శ్రీలంక ఆడిన టెస్టు మ్యాచ్‌లు. ఆ జట్టు ఒక్క విజయం కూడా సాధించలేదు. 11 మ్యాచ్‌ల్లో ఓడి, 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా ఇరు జట్ల మధ్య 44 టెస్టులు జరగ్గా భారత్‌ 20 నెగ్గింది. 17 మ్యాచ్‌లు డ్రా కాగా.. 7 టెస్టుల్లో శ్రీలంక గెలిచింది.

38
టెస్టుల్లో 8 వేల మైలురాయిని అందుకోవడానికి కోహ్లికి అవసరమైన పరుగులు.

భారత క్రికెట్లో '100' వీరులు

  • సచిన్‌ (200), ద్రవిడ్‌ (163), లక్ష్మణ్‌ (134), కుంబ్లే (132), కపిల్‌ (131), గావస్కర్‌ (125), వెంగ్‌సర్కార్‌ (116), గంగూలీ (113), ఇషాంత్‌ (105), హర్భజన్‌ (103), సెహ్వాగ్‌ (103)
  • 100వ టెస్టు ఆడబోతున్న 71వ ఆటగాడు కోహ్లీ. చివరగా శతకం అందుకున్నాక అతను ఆడబోతున్న 71వ ఇన్నింగ్స్‌ ఇది. ఈ మ్యాచ్‌లో సెంచరీ అందుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో 71వది అవుతుంది.
  • ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడిన రెండు టెస్టుల్లోనూ నెగ్గిన శ్రీలంక అగ్రస్థానంలో ఉండగా.. 10 మ్యాచ్‌లాడి నాలుగే నెగ్గిన భారత్‌ అయిదో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: Virat Kohli: 'వంద టెస్టులు ఆడతానని నిజంగా ఊహించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.