ETV Bharat / sports

కపిల్ దేవ్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో అశ్విన్ అరుదైన ఘనత

India vs Sri Lanka: టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు టీమ్​ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దిగ్గజ ఆల్​రౌండర్​ కపిల్​దేవ్​ను అధిగమించి భారత్​ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

India vs Sri Lanka
Ashwin
author img

By

Published : Mar 6, 2022, 3:47 PM IST

India vs Sri Lanka: లెజెండరీ క్రికెటర్​ కపిల్​దేవ్​ రికార్డును బ్రేక్ చేశాడు స్టార్ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​. ఆదివారం శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా 435 వికెట్లతో సుదీర్ఘ ఫార్మాట్​లో భారత తరపున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే కపిల్​ను (131 మ్యాచ్​ల్లో 434 వికెట్లు) అధిగమించాడు. తన 85వ మ్యాచ్​లోనే అశ్విన్​ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఈ జాబితాలో 132 మ్యాచ్​ల్లో 619 వికెట్లతో స్పిన్ దిగ్గజం అనిల్​ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు.

శ్రీలంకతో మ్యాచ్​కు ముందు 430 వికెట్లతో ఉన్న అశ్విన్​.. తొలి ఇన్నింగ్స్​లో 2, రెండో ఇన్నింగ్స్​లో ఇప్పటికే 3 వికెట్లు తీశాడు. ఇక టెస్టుల్లో 400లకు పైగా వికెట్లు సాధించిన నాలుగో భారత బౌలర్ అశ్విన్. అతడి కన్నా ముందు కపిల్, కుంబ్లే, హర్భజన్​ సింగ్ (417) ఈ మైలురాయిని చేరుకున్నారు.​ ఓవరాల్​గా అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు అశ్విన్.

ఇదీ చూడండి: IND VS SL: జడేజా మాయాజాలం.. 174కే లంక ఆలౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.