ETV Bharat / sports

INDIA VS SRI LANKA: టెస్టుల్లో పంత్ రికార్డు.. భారీ ఆధిక్యంలో టీమ్​ఇండియా - rishabh pant

INDIA VS SRI LANKA: గులాబీ టెస్టులో రెండో రోజు ఆటలో టీమ్​ఇండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. రెండో ఇన్నింగ్స్​లో డిన్నర్ బ్రేక్​ సమయానికి 199/5 పరుగుల వద్ద నిలిచింది.

INDIA VS SRI LANKA 2ND TEST
INDIA VS SRI LANKA
author img

By

Published : Mar 13, 2022, 6:32 PM IST

Updated : Mar 13, 2022, 7:06 PM IST

INDIA VS SRI LANKA: రెండో రోజు డిన్నర్​ బ్రేక్​ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది టీమ్​ఇండియా. క్రీజులో శ్రేయస్ అయ్యర్ (18*), జడేజా (10*) ఉన్నారు. ప్రస్తుతం 342 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది భారత్.

టీ విరామం తర్వాత 61/1 స్కోరుతో ఇన్నింగ్స్​ మొదలుపెట్టిన భారత్​.. ధాటిగా ఆడటం ప్రారంభించింది. కెప్టెన్​ రోహిత్ శర్మ (46) అర్ధశతకం దిశగా సాగాడు. అయితే ధనంజయ బౌలింగ్​లో 31వ ఓవర్లో అతడు వెనుదిరిగాడు. ఆ వెంటనే విహారి (35) కూడా ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్​లోనూ విరాట్​ కోహ్లీ (18) ఎల్బీడబ్ల్యూగానే పెవిలియన్​ చేరాడు. అప్పటికే క్రీజులోకి వచ్చిన పంత్​ దంచికొట్టుడుతో భారత్​కు భారీ ఆధిక్యం లభించింది.

పంత్.. రికార్డు హాఫ్ సెంచరీ..

ఈ క్రమంలోనే టెస్టుల్లో టీమ్​ఇండియా తరఫున అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించి రికార్డు నెలకొల్పాడు రిషభ్ పంత్. కేవలం 28 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులుచేశాడు. అంతకుముందు కపిల్​దేవ్​ (30 బంతులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

ఇదీ చూడండి: కోహ్లీలా ఉండలేను.. ధోనీకి నాకూ పోలిక ఉంది: డుప్లెసిస్​

Last Updated : Mar 13, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.