ETV Bharat / sports

IND vs SA Test Series: ఇప్పటి వరకు ఒక్కటీ లేదు.. ఈ సారైనా సిరీస్‌ దక్కేనా..?

India vs South Africa Test Series head to head: స్వదేశీ పిచ్‌లపై ఏ జట్టైనా కింగే.. అక్కడి పరిస్థితులు వారికి కొట్టినపిండి. అదే వేరే దేశం వెళ్లినప్పుడు ఎంతటి పెద్ద జట్టుకైనా పరా'భయం' తప్పదు. అయితే గత మూడేళ్ల నుంచి విదేశీ పిచ్‌లపైనా రాణిస్తూ భారత్‌ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పుడు విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నేటివరకు ఒక్కసారి కూడా ఆఫ్రికా గడ్డ మీద మన జట్టు టెస్ట్‌ సిరీస్‌ నెగ్గలేదు. మరి ఈ సారైనా ఆ లోటును పూడ్చుకుంటుందో లేదో.. వేచి చూడాలి. ఈ లోపు ఇరు జట్లు ముఖాముఖిగా ఎన్నిసార్లు తలపడ్డాయి. సొంత గడ్డ మీద ప్రొటీస్‌ జట్టు ఎన్ని సిరీస్‌లను కైవసం చేసుకుందో ఓ సారి తెలుసుకుందాం..

South Africa vs India news
కోహ్లీ
author img

By

Published : Dec 21, 2021, 7:16 PM IST

Updated : Dec 21, 2021, 8:36 PM IST

IND vs SA Test Series: గత ముప్పై ఏళ్ల (1992) నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఇరు దేశాల్లో చెరో ఏడేసి సార్లు పర్యటించాయి. మొత్తం 39 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో 20 టెస్టులు దక్షిణాఫ్రికాలో మరో 19 టెస్టులు భారత్‌లో జరిగాయి. స్వదేశంలో టీమ్‌ఇండియా ఎంత పటిష్ఠమైన జట్టో మనందరికీ తెలుసు. కానీ 19 టెస్టుల్లో భారత్ పదకొండు, దక్షిణాఫ్రికా ఐదు గెలుచుకోగా.. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇందులో ఒక సిరీస్‌నూ ప్రొటీస్ జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయితే దక్షిణాఫ్రికా వారి దేశంలో మాత్రం టీమ్‌ఇండియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆఫ్రికా నేల మీద భారత్‌ ఒక్క సిరీసూ నెగ్గలేదు. ఇరవై టెస్టుల్లో పదింట్లో దక్షిణాఫ్రికా గెలవగా.. కేవలం మూడే మ్యాచుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. మరో ఏడు టెస్టులను డ్రా చేసుకుంది. చివరి సారిగా భారత్‌ 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. మూడు టెస్టులను ఆడింది. అయితే దక్షిణాఫ్రికా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ వెళ్తున్న టీమ్‌ఇండియా సరిగ్గా మూడు టెస్టులనే ఆడనుంది. ఈసారైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. జాతి వివక్ష కారణంగా నిషేధం ఎదుర్కొని మళ్లీ 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికాకు అప్పట్లో మద్దతుగా బీసీసీఐ నిలిచింది. అప్పుడు భారత జట్టే తొలిసారి సిరీస్‌ ఆడేందుకు ఆ దేశంలో పర్యటించింది. అందుకే 30 ఏళ్ల ఉత్సవాలను నిర్వహించాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కాస్త సందిగ్ధత నెలకొంది.

దక్షిణాఫ్రికాలో తొలిసారి టీమ్‌ఇండియా ఇలా..

South Africa vs India news
దక్షిణాఫ్రికాలో తొలిసారి టీమ్‌ఇండియా ఇలా..

IND vs SA First Test: దాదాపు మూడు దశాబ్దాల కిందట (1992/93) మహమ్మద్‌ అజహరుద్దీన్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టులు ఆడింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే మూడో టెస్టులో దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియాను మట్టికరిపించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు కూడా డ్రా కావడంతో ఆ సిరీస్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. నిషేధం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి సిరీస్‌ విజయం ఇదే కావడం గమనార్హం. భారత్‌ తీవ్రంగా ప్రయత్నించినా దక్షిణాఫ్రికా ముందు తలవంచక తప్పలేదు.

సిరీస్‌ విజయం కోసం ఎదురు చూపులే

South Africa vs India news
సిరీస్‌ విజయం కోసం ఎదురు చూపులే

మరో నాలుగేళ్లకు (1996/97) మన దేశ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాను భారత్‌ కట్టడి చేసి మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే అదే సీజన్‌లో భారత్‌ మరోసారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈసారి కూడానూ ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. సిరీస్‌ విజయం కోసం ఎదురు చూపు తప్పలేదు. మూడు టెస్టుల్లో దక్షిణాఫ్రికా 2 గెలుచుకోగా.. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి రెండు టెస్టుల్లో కనీసం పోరాటం చేయలేక చేతులెత్తేసిన భారత్‌.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం చావు తప్పి కన్నులొట్టపోయినట్లు డ్రాతో గట్టెక్కింది. ఈ సిరీస్‌లో భారత్‌ తన అత్యల్ప స్కోర్లలో ఒకటైన 66/10ను నమోదు చేసింది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వందకు ఆలౌటైన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులకే కుప్పకూలింది. ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌కిదే తొలి దక్షిణాఫ్రికా పర్యటన కావడం విశేషం. ఇప్పుడు భారత ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ అక్కడికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆటగాడిగా సాధించలేని సిరీస్‌ విజయాన్ని కోచ్‌గా అందిస్తాడేమో చూడాలి.

సచిన్‌ రాణించినా.. దక్షిణాఫ్రికాదే మళ్లీ సిరీసూ

Ind vs SA Highlights: రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం టీమ్‌ఇండియా (2001/02) దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సచిన్‌ (155), సెహ్వాగ్ (105) రాణించడంతో భారత్‌ 379 పరుగులు చేయగలిగింది. అనంతరం గిబ్స్ (107), క్లూసెనర్ (108), కిరెస్టన్ (73), కలిస్ (68), నీల్ (68), బౌచర్ (47) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 563 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 237 పరుగులకే ఆలౌట్‌ కావడంతో దక్షిణాఫ్రికాకు కేవలం 54 పరుగుల లక్ష్యం మాత్రమే నిర్దేశించగలిగింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పోరాటపటిమ చూపడంతో డ్రాతో గట్టెక్కారు. మళ్లీ సిరీస్‌ను దక్షిణాఫ్రికా (1-0) కైవసం చేసుకోవడంతో భారత్‌కు నిరీక్షణ తప్పలేదు.

ఎట్టకేలకు ఓ మ్యాచ్‌ విజయం..

South Africa vs India news
ఎట్టకేలకు ఓ మ్యాచ్‌ విజయం..

ఎన్నో ఆశలతో ఐదేళ్ల తర్వాత (2006/07) రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అద్భుత ప్రదర్శనతో భారత్‌ తొలి టెస్టులో విజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆఫ్రికా గడ్డ మీద గెలుపు రుచి చూసింది. మొదటిసారి సిరీస్‌ దక్కుతుందేమోనని సగటు అభిమాని ఆశించాడు. అయితే తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆనందం.. రెండో టెస్టు ఓటమితో కరిగిపోయింది. సెకండ్‌ మ్యాచ్‌లో పుంజుకున్న దక్షిణాఫ్రికా 174 పరుగుల తేడాతో భారత్‌పై భారీ విజయం సాధించింది. సిరీస్‌ను సమం చేసింది. ఇక ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా (414) రాణించింది. అయితే సౌతాఫ్రికా (373) కూడా దీటుగా స్పందించింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్‌ (169) కుప్పకూలింది. దీంతో 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయంతోపాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది.

తొలిసారి డ్రాగా ముగిసిన సిరీస్‌

South Africa vs India news
తొలిసారి డ్రాగా ముగిసిన సిరీస్‌

అప్పటివరకు దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయం సాధించలేని టీమ్‌ఇండియాకు (2010/11) ఈ పర్యటన మాత్రం మరిచిపోలేనిది. సిరీస్‌ దక్కకపోయినా.. కనీసం డ్రాగా ముగించడం విశేషం. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు దక్షిణాఫ్రికాకు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా వెళ్లింది. మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా, భారత్‌ చెరొక విజయం సాధించాయి. మరొకటి డ్రాగా ముగిసింది. దీంతో తొలిసారి సిరీస్‌ను చేజార్చుకోకుండా భారత్‌ తిరిగి రావడం విశేషం. మళ్లీ రెండేళ్లకు (2013/14) ఆ దేశ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియాకు ఈసారి మాత్రం పరాభవం తప్పలేదు. రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.

మూడేళ్ల కిందట కోహ్లీ నాయకత్వంలో.. (2018)

IND vs SA 2nd Test 2018: ఈ సారి (2018) కూడా టీమ్‌ఇండియా భారీ ఎత్తున సమాయత్తమై దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లింది. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడింది. అయితే వరుసగా రెండు టెస్టులను గెలిచిన సౌతాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినా ప్రయోజనం మాత్రం శూన్యం. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు మరోసారి సౌతాఫ్రికా టూర్‌కు బయల్దేరి వెళ్లింది. మరోవైపు టీ20 కెప్టెన్‌గా తప్పుకోవడం.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో విజయంతో తిరిగి రావాలని కోహ్లీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక భారత ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కిదే మొట్టమొదటి విదేశీ పర్యటన. స్వదేశంలో కివీస్‌తో వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ద్రవిడ్ నేతృత్వంలోనూ విదేశంలో సత్తా చాటాలి. జట్ల పరంగా చూస్తే ఇప్పుడు టీమ్‌ఇండియానే ప్రొటీస్ కంటే కాస్త బలంగా ఉంది. బుమ్రా, షమీ, ఇషాంత్‌, శార్దూల్‌ వంటి పేసర్లు.. రవిచంద్రన్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌లాంటి బౌలర్లు మంచి లయతో ఉన్నారు. మయాంక్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌ బ్యాటర్లూ ఫామ్‌తో ఉన్నారు. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో కీలకమైన డికాక్‌ తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండటం.. మిగతావారిలోనూ సీనియర్లు లేకపోవడం కూడా టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం.

దక్షిణాఫ్రికాతో ముఖాముఖిగా తలపడిన మ్యాచ్‌లు..

టెస్టులు: 39

  • భారత్‌ విజయం సాధించినవి: 14
  • దక్షిణాఫ్రికా గెలిచినవి: 15
  • డ్రాగా ముగిసినవి: 10

వన్డేలు : 84

  • భారత్‌: 35
  • దక్షిణాఫ్రికా: 46
  • ఫలితం లేనివి: 3

టీ20లు : 17

  • భారత్‌ గెలిచినవి: 9
  • సౌతాఫ్రికా: 6
  • ఫలితం తేలనది: 1

ఇదీ చదవండి:

Kohli Dravid Record: ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన విరాట్

Last Updated : Dec 21, 2021, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.