ETV Bharat / sports

'భారత్​ ఆ సిరీస్​ గెలవాలంటే విరాట్​ కీలకం​- కోహ్లీ ఎక్కడైనా భారీ ఆటగాడే' - virat kohli test vs south africa

India Vs South Africa Test Series 2023 : దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే టెస్ట్​ సిరీస్​లో విరాట్​ కోహ్లీ కీలకం అవుతాడని సఫారీ మాజీ క్రికెటర్ జాక్వెస్​ కాలిస్​ అన్నాడు. కోహ్లీ ఎక్కడైనా భారీ ఆటగాడే అని కొనియాడాడు. ఇంకా ఏమన్నాడంటే?

India Vs South Africa Test Series 2023
India Vs South Africa Test Series 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 1:50 PM IST

Updated : Dec 11, 2023, 2:46 PM IST

India Vs South Africa Test Series 2023 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సఫారీలతో త్వరలో ఆడబోయే టెస్ట్​ సిరీస్​లో విజయం సాధించాలంటే విరాట్​ కోహ్లీ ఫామ్, దక్షిణాఫ్రికా పరిస్థితులపై అతడికి ఉన్న అవగాహన కీలకం అని అన్నాడు. ఈ కోహ్లీ మంచి ఫామ్​లో ఉన్నాడన్న కలిస్​, ఈ సిరీస్​లో అతడు మంచి ప్రదర్శన చేస్తాడని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు.

"అతడు (విరాట్​ కోహ్లీ) ఎక్కడ ఉన్నా భారీ ఆటగాడే. ఇక్కడ విరాట్ కోన్ని మ్యాచ్​లు ఆడాడు. కొన్నింట్లో విజయం సాధించాడు. ఇక్కడి పరిస్థితులపై అతడికి ఉన్న సమాచారాన్ని ఇతర ప్లేయర్లకు, ప్రత్యేకించి యువ ఆటగాళ్లకు అందించగలడు. ఇక్కడి పరిస్థితులను ఎలా మేనేజ్​ చేయాలో దాని నుంచి ఏం ఆశించాలో వారికి సూచనలు ఇవ్వగలడు. భారత జట్టు బాగుంది. కానీ దక్షిణాఫ్రికాను బీట్​ చేయడం కూడా చాలా కష్టం. సెంచూరియన్ పిచ్​ బహుశా దక్షిణాఫ్రికాకు అనుకూలంగా ఉంటుంది. న్యూలాండ్స్​ బహుశా భారత్​ ప్రస్తుత జట్టు పరిస్థితికి సరిపోతుంది. ఈ సిరీస్​లో ఇరు జట్లకు గట్టి పోటీ ఉంటుంది"
-- జాక్వెస్ కలిస్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

అయితే టీమ్ఇండియా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. ఈ మేరకు 16 మందితో కూడిన జట్టును ఇదివరకే ప్రకటించింది బీసీసీఐ.

టెస్టు సిరీస్ షెడ్యూల్

  • తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్‌ మధ్యాహ్నం 1:30
  • రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00

భారత్‌ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

  • Jacques Kallis said - "Virat Kohli is a massive player. He will play a major role and he will have a good series if India wins the Test series". (Star Sports) pic.twitter.com/cNM3kiNiJl

    — CricketMAN2 (@ImTanujSingh) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'అలాంటి వారికి కెప్టెన్సీ ఇవ్వకూడదు'- టీ20 వరల్డ్​కప్​ సారథిపై గంభీర్ కామెంట్స్

తొలి మ్యాచ్​ వర్షార్పణం - టాస్ పడకుండానే మ్యాచ్​ రద్దు

Last Updated : Dec 11, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.