India Vs South Africa Test Series : సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు టీమ్ఇండియా బౌలర్లు సత్తా చాటలేకపోయారు. దీంతో ప్రత్యర్థులను కట్టడి చేసే విషయంలో విఫలమయ్యారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి 256/5 స్కోరుతో సఫారీలు దూసుకెళ్తున్నారు. అయితే సరైన వెలుతురు లేమి కారణంగా ఆటను 66 ఓవర్ల వద్ద ఆపేశారు.
ఇక సౌతాఫ్రికా ప్లేయర్లలో డీన్ ఎల్గర్ (140*) అదరగొట్టాడు. ఇక డేవిడ్ బెడింగ్‌హమ్ (56) కూడా అర్ధ శతకంతో రాణించాడు. తర్వాతి ఆట కోసం ఎల్గర్‌తోపాటు మార్కో జాన్సన్ (3*) క్రీజులో ఉన్నాడు. ఇక టోనీ డి జోర్జి (28), మార్‌క్రమ్ (5), కీగన్ పీటర్సన్ (2), వెరినే (4) పరుగులు చేశారు.
-
Bad light brings an end to Day 2.
— BCCI (@BCCI) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
South Africa reach 256/5, with a lead of 11 runs.
Scorecard ▶️ https://t.co/032B8Fn3iC#TeamIndia | #SAvIND pic.twitter.com/XngpVF2kcr
">Bad light brings an end to Day 2.
— BCCI (@BCCI) December 27, 2023
South Africa reach 256/5, with a lead of 11 runs.
Scorecard ▶️ https://t.co/032B8Fn3iC#TeamIndia | #SAvIND pic.twitter.com/XngpVF2kcrBad light brings an end to Day 2.
— BCCI (@BCCI) December 27, 2023
South Africa reach 256/5, with a lead of 11 runs.
Scorecard ▶️ https://t.co/032B8Fn3iC#TeamIndia | #SAvIND pic.twitter.com/XngpVF2kcr
మరోవైపు భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం ఒక వికెట్ తీయగలిగాడు. అంతకుముందు 208/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా నేడు జరిగిన మ్యాచ్‌లో మరో 37 పరుగులు జోడించి 245 పరుగులకు ఆలౌటైంది. ఇక 70 పరుగులతో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (101) శతకం బాది 10వ వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.
India Vs South Africa Test Day 1 : డిసెంబర్ 26న మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. పూర్తిగా పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) విఫలం కాగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (38) ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ 200 మార్క్ అందుకోవడం కష్టమే అనిపించింది. ఈ దశలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. క్రీజులో నిలదొక్కుకొని స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 208-8తో నిలిచింది.
'రాహుల్ ఇన్నింగ్స్‌లో అవన్నీ ఉన్నాయి - అలా చేయడం అతడికే సాధ్యం'
అక్కడున్నది విరాట్ కోహ్లీ మరి - దెబ్బకు రెండు వికెట్లు డౌన్