India Vs South Africa 3rd T20 : సౌతాఫ్రికా సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి టీ20 టీమ్ఇండియా విజయంతో ముగిసింది. రెండో టీ20 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు రెట్టింపు వేగంతో ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని చూపించింది. సెంచరీతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చితక్కొట్టగా, దీనికి బర్త్‌డే బాయ్ కుల్‌దీప్ యాదవ్ (5/17) మెరుపులు తోడయ్యాయి. దీంతో గురువారం జరిగిన పోరులో భారత్ 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి. అంతే కాకుండా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. దీంతో ఇరు జట్లకు మేనేజ్మెంట్ ఒకే కప్‌ను అందించింది. మరోవైపు 'ప్లేయర్ ఆఫ ద మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' బిరుదు సూర్య కుమార్ ఖాతాలో పడ్డాయి.
-
An indeed Happy Birthday 🎂@imkuldeep18 records his first 5 wicket haul in T20Is 👏
— BCCI (@BCCI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the match ▶️ https://t.co/NYt49KwF6j#TeamIndia | #SAvIND pic.twitter.com/ZqMZNbjlQv
">An indeed Happy Birthday 🎂@imkuldeep18 records his first 5 wicket haul in T20Is 👏
— BCCI (@BCCI) December 14, 2023
Follow the match ▶️ https://t.co/NYt49KwF6j#TeamIndia | #SAvIND pic.twitter.com/ZqMZNbjlQvAn indeed Happy Birthday 🎂@imkuldeep18 records his first 5 wicket haul in T20Is 👏
— BCCI (@BCCI) December 14, 2023
Follow the match ▶️ https://t.co/NYt49KwF6j#TeamIndia | #SAvIND pic.twitter.com/ZqMZNbjlQv
-
Captain @surya_14kumar is adjudged Player of the Series 🙌
— BCCI (@BCCI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
His fine form in T20I continues 👌#TeamIndia | #SAvIND pic.twitter.com/82wXsLvamZ
">Captain @surya_14kumar is adjudged Player of the Series 🙌
— BCCI (@BCCI) December 14, 2023
His fine form in T20I continues 👌#TeamIndia | #SAvIND pic.twitter.com/82wXsLvamZCaptain @surya_14kumar is adjudged Player of the Series 🙌
— BCCI (@BCCI) December 14, 2023
His fine form in T20I continues 👌#TeamIndia | #SAvIND pic.twitter.com/82wXsLvamZ
ఇక సూర్యతో పాటు యశస్వి జైస్వాల్ (60) మెరవడం వల్ల మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కుల్‌దీప్‌తో పాటు జడేజా (2/25), ముకేశ్ (1/21), అర్ష్‌దీప్ (1/13) బంతితో రాణించారు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు 13.5 ఓవర్లకు 95 పరుగులు చేసి కుప్పకూలింది. ఆ జట్టులో మిల్లర్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
-
Joint winners of the T20I series.
— BCCI (@BCCI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🇮🇳 🤝 🇿🇦 #SAvIND pic.twitter.com/8Zg0aEhKoL
">Joint winners of the T20I series.
— BCCI (@BCCI) December 14, 2023
🇮🇳 🤝 🇿🇦 #SAvIND pic.twitter.com/8Zg0aEhKoLJoint winners of the T20I series.
— BCCI (@BCCI) December 14, 2023
🇮🇳 🤝 🇿🇦 #SAvIND pic.twitter.com/8Zg0aEhKoL
సూర్య భాయ్ వన్ మ్యాన్ షో!
తొలుత సూర్య తనదైన శైలిలో విరుచుకుపడకపోవడం వల్ల పరుగులు అంతగా రాలేదు. ఈ క్రమంలో 6 నుంచి 10 ఓవర్ల మధ్య 31 పరుగులే వచ్చాయి. దీంతో సూర్య తానెదుర్కొన్న తొలి 24 బంతుల్లో 26 పరుగులే చేశాడు. 10 ఓవర్లకు స్కోరు 87/2. కానీ ఆ తర్వాత గేర్ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్స్‌ల మోతతో కనువిందు చేశాడు. ఎక్స్‌ట్రా కవర్‌లో కళ్లు చెదిరే షాట్లను ఆడాడు. ఆ తర్వాత సూర్యకు హద్దే లేకుండా పోయింది. వరుసగా 6, 4, 6, 6 బాదడం వల్ల 13వ ఓవర్లో ఫెలుక్వాయో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన షంసికి కూడా చుక్కలు చూపించాడు. జైస్వాల్‌ను షంసి ఔట్ చేయడం వల్ల 112 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడినప్పటికీ సూర్య తన జోరును కొనసాగించాడు. బర్గర్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాదేశాడు. దీంతో భారత జట్టు స్కోర్ 18 ఓవర్లలో 186/3తో నిలిచింది. అయితే కానీ చివరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 15 పరుగులే చేసింది.
మరోవైపు 19వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చిన షంసి ఈ మ్యాచ్‌లో రింకు (14)ను ఔట్ చేశాడు. దీంతో రింకు ఈసారి అంత ధాటిగా ఆడలేకపోయాడు. 10 బంతుల్లో ఒక సిక్స్‌తో 14 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే చివరి ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి శతకం పూర్తి చేసిన సూర్య ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి మరో 23 బంతుల్లో శతకానికి చేరుకుని రికార్డుకెక్కాడు. అయితే ఆఖరి ఓవర్లో జడేజా, జితేశ్ శర్మ కూడా ఔటయ్యారు. జితేశ్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
-
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘
— BCCI (@BCCI) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
There is no stopping @surya_14kumar!
Mr. 360 brings up his 4th T20I century in just 55 balls with 7x4 and 8x6. The captain is leading from the front!🙌🏽👌🏽https://t.co/s4JlSnBAoY #SAvIND pic.twitter.com/t3BHlTiao4
">𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘
— BCCI (@BCCI) December 14, 2023
There is no stopping @surya_14kumar!
Mr. 360 brings up his 4th T20I century in just 55 balls with 7x4 and 8x6. The captain is leading from the front!🙌🏽👌🏽https://t.co/s4JlSnBAoY #SAvIND pic.twitter.com/t3BHlTiao4𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘
— BCCI (@BCCI) December 14, 2023
There is no stopping @surya_14kumar!
Mr. 360 brings up his 4th T20I century in just 55 balls with 7x4 and 8x6. The captain is leading from the front!🙌🏽👌🏽https://t.co/s4JlSnBAoY #SAvIND pic.twitter.com/t3BHlTiao4
సూర్య భాయ్ ధనాధన్ సెంచరీ- రోహిత్ రికార్డ్ సమం- ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్
టీ20ల్లోనూ విరాట్, రోహితే టాప్- లిస్ట్‌లో ఉన్న టీమ్ఇండియా బ్యాటర్లు వీళ్లే!