India vs South Africa 2nd ODI : టీమ్ఇండియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌పై కన్నేసి ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గెబరా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు 42.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు.
-
THE PROTEAS LEVEL THE SERIES 💪
— Proteas Men (@ProteasMenCSA) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Proteas bounce back in emphatic fashion led by a stunning madien century by Tony de Zorzi 👌
What A Victory! 🇿🇦#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/ENjUy3W1EX
">THE PROTEAS LEVEL THE SERIES 💪
— Proteas Men (@ProteasMenCSA) December 19, 2023
The Proteas bounce back in emphatic fashion led by a stunning madien century by Tony de Zorzi 👌
What A Victory! 🇿🇦#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/ENjUy3W1EXTHE PROTEAS LEVEL THE SERIES 💪
— Proteas Men (@ProteasMenCSA) December 19, 2023
The Proteas bounce back in emphatic fashion led by a stunning madien century by Tony de Zorzi 👌
What A Victory! 🇿🇦#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/ENjUy3W1EX
ఓపెనర్లు రిజా హెండ్రిక్స్ టోనీ డీ జోర్జి (119*) శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ (52) అర్ధ శతకం బాదాడు. వాండర్ డసెన్ (36) రాణించాడు. తొలి మ్యాచ్‌లో సఫారీలను బెంబేలెత్తించిన భారత బౌలర్లు ఈమ్యాచ్‌లో తేలిపోయారు. అర్ష్‌దీప్, రింకు సింగ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించడంతో సిరీస్ 1-1 సమం అయింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్ నిర్ణయాత్మక పోరు గురువారం (డిసెంబరు 21న) జరుగనుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 46.2 ఓవర్లలో 211 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి బంతికే బౌండరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్ ఆ తర్వాతి బంతికి ఔటై పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (10) కూడా విఫలమయ్యాడు. ఇక 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్‌లు ఆదుకున్నారు. నెమ్మదిగానే బ్యాటింగ్ చేస్తూ స్కోరుబోర్డును నడిపించారు. అలా మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.
అర్ధ సెంచరీ చేసిన సాయి 27వ ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి దిగిన సంజూ శాంసన్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రింకూ సింగ్ (17) కూడా ఈ మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అక్షర్ పటేల్ (7), కుల్‌దీప్ యాదవ్ (1) కూడా మెరుపులు మెరిపించలేకపోయారు. ఆఖరిలో అర్ష్‌దీప్ సింగ్ (18) కాస్త బ్యాటుకు పని చెప్పి టీమ్ఇండియాను 200 మార్క్‌ను దాటించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాడ్ విలియమ్స్, మార్‌క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు, ఈ మ్యాచ్‌లో 2023లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
-
Milestone 🔓 - 1000 ODI runs and counting for @klrahul in the year 2023 🫡🫡#TeamIndia pic.twitter.com/WRVKvi2BJd
— BCCI (@BCCI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Milestone 🔓 - 1000 ODI runs and counting for @klrahul in the year 2023 🫡🫡#TeamIndia pic.twitter.com/WRVKvi2BJd
— BCCI (@BCCI) December 19, 2023Milestone 🔓 - 1000 ODI runs and counting for @klrahul in the year 2023 🫡🫡#TeamIndia pic.twitter.com/WRVKvi2BJd
— BCCI (@BCCI) December 19, 2023